ఒకప్పుడు సినిమాల్లో ‘వేశ్య’ అనే పదాన్ని ఉపయోగించేందుకే ఫిల్మ్ మేకర్స్ తడబడేవారు. ‘A’ సర్టిఫికెట్ వస్తుందేమో అన్న భయం. కానీ ఇపుడు ఏ సర్టిఫికెట్ వచ్చినా మంచిదే అంటున్నారు. గత కొన్నేళ్లుగా పరిస్థితి మారింది. ముఖ్యంగా వెబ్ సిరీస్ల ప్రభావం సినిమాలపై బాగా పడుతోంది.
వెబ్ సిరీస్ లో స్టార్ హీరోయిన్లే బూతు సీన్లు చేసేస్తున్నారు. కియారా అద్వానీ భావ ప్రాప్తి సీన్, కాజల్ ‘ప్రెస్సింగ్‘ సీన్ ఎంతో వైరల్ అయ్యాయి. అయితే, అవి సెలక్టెవ్ ప్రేక్షకుల కోసం. అయితే కుటుంబాలు థియేటర్లలో వచ్చి చూసే సినిమాల్లో బూతులు పెరగడం కొత్త ట్రెండ్.
మాస్ సినిమా, ఫ్యామిలీ సినిమా ‘సిటీమార్’ లో తమన్నాతో దర్శకుడు అసభ్య పదజాలం పలికించడం అందరికీ పెద్ద షాక్. ఇందులో తమ్ము జ్వాలారెడ్డి అనే తెలంగాణ అమ్మాయి పాత్రలో నటించారు. ఈ తరానికి తగ్గట్టుగా ఉందా పాత్ర. అయితే ఈ సినిమాలో తమన్నాతో ‘లం..కొడుకు’ అని అభ్యంతరకరమైన డైలాగ్ చెప్పించారు. డబ్బింగ్ చెప్పింది కూడా తమన్నాయే.
ఈ రేంజ్ లో డైలాగ్ కి మిల్కీ బ్యూటీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం ఆశ్చర్యమే. దర్శకుడు బానే ఒప్పించాడు. సెన్సార్ వాళ్లు దీనిని ఎలా స్కిప్ చేశారో మరి. ఏదో ఏమైనా… తమన్నా తెలుగే కాదు, తెలుగు బూతులు కూడా మాట్లాడుతోంది.