ప్రతి వ్యక్తీ తన వంతుగా సాయం చేస్తే, అడుగు ముందుకు వేస్తే… లోకమే మారిపోతుంది అనే నమ్మకంతో ఏర్పడింది ‘టచ్ ఏ లైఫ్’.
ఇదే ఆశయంతో ఏటా ‘వరల్డ్ కైండ్ నెస్ డే’ నిర్వహిస్తోంది.
ఈ ఏడాది కూడా నవంబరు 19న… కాలిఫోర్నియా, శాంతక్లారా కన్వెన్షన్ సెంటర్లో ‘టచ్ ఏ లైఫ్’ వరల్డ్ కైండ్ నెస్ డే నిర్వహిస్తున్నారు.
ఒక రోజంతా జరగనున్న ఈ వేడుకలలో భాగంగా సామాజిక సమస్యల మీద చర్చలు, కీనోట్స్, విద్యార్థులకు బూట్ క్యాంప్, నృత్యసంగీత ప్రదర్శనలు ఉంటాయి.
ఏటా వరల్డ్ కైండ్ నెస్ డే సందర్భంగా సమాజం కోసం పాటు పడుతున్న అరుదైన వ్యక్తులను టాల్ హీరో పురస్కారాలతో గుర్తించి, గౌరవించే ప్రయత్నం చేస్తోంది ‘టచ్ ఏ లైఫ్’.
ఇందులో భాగంగా ఇప్పటివరకూ గ్రామీణ ఆవిష్కర్త మండాజీ నర్సింహాచారి, రైస్ ఏటిఎమ్ వ్యవస్థాపకులు రాము దోసపాటి, కేన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్న ఇసబెల్లా స్పార్, విద్యావేత్త క్రిస్ ఫంక్, పర్యావరణవేత్త విజయ్ రామ్ వంటి ఎంతోమంది… తమ రంగాల ద్వారా సమాజం మీద సానుకూల ప్రభావం చూపినందుకు ఈ అవార్డును అందుకున్నారు.
టాల్ హీరో అవార్డుల ప్రభావాన్ని గమనించిన టాల్ ఈసారి వ్యక్తులతో పాటు, సామాజిక సంస్థలు, సమాజ సేవ చేస్తున్న కంపెనీలకు కూడా ఈ పురస్కారాలను అందిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా సరే, తనకు తెలిసిన మంచి మనుషులను ఈ అవార్డు కోసం నామినేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.
ఈ ఏడాది టాల్ హీరో అవార్డులకు అనూహ్యమైన స్పందన వచ్చింది. వీటిని టాల్ నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత… అమెరికా, ఇండియాల నుంచి 18 అవార్డులను ప్రకటించారు.
స్టార్టప్స్ కు ప్రోత్సాహంగా నిలుస్తున్న TiE, కష్టకాలంలో భారతీయులకు అండగా నిలబడిన రవి పులి, పర్యావరణం కోసం పాటుపడుతుకున్న కొమెరజాజి, సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్న ఇన్ఫోసిస్ లతో పాటు మరెందరో ప్రతిభావంతులకు, స్ఫూర్తిని అందిస్తున్న సంస్థలకు ఈ అవార్డులను అందిస్తున్నారు.
నవంబర్ 19న జరుగుతున్న World Kindness Day రోజున ఈ అవార్డులను అందించనున్నారు.