AP : అలా అప్పులు తేవడం ఆర్థిక నేరం
ఏపీఎస్డీసీ ద్వారా రుణాలు తేవడంపై ఆర్బీఐ ఆగ్రహం కార్పొరేషన్లకు అప్పులివ్వొద్దు, కట్టే స్తోమత ఉందో లేదో చూడాలి బడ్జెట్ నుంచి చెల్లిస్తామంటే కుదరదు, అన్ని బ్యాంకులకు ఆర్బీఐ సర్క్యులర్ జగన్ సర్కార్ అప్పుల కోసం అడ్డదారులు తొక్కుతున్న వైనాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తప్పుబట్టింది. రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎస్డీసీ) పేరుతో అరాచకాలు చేస్తోందని ధ్రువీకరించింది. పైసా ఆదాయం లేని ఆ కార్పొరేషన్ ద్వారా అప్పులు తేవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3)కి విరుద్థమని, మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించి దానిని ఖజానాకు కాకుండా ఏపీఎస్డీసీకి మళ్లించడం రాజ్యాంగాన్ని అతిక్రమించడమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్ 293(3) ప్రకారం.. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకోకూడదు. కేంద్రం అనుమతితో తీసుకున్న రుణాలను రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాలి. కానీ ఏపీఎస్డీసీ విషయంలో కేంద్రానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఖజానాకు రావలసిన మద్యం ఆదాయాన్ని ఆ కార్పొరేషన్‌కు మళ్లించి రూ.25,000 కోట్ల అప్పు తెచ్చుకోవడానికి బ్యాంకులతో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.23,200 కోట్ల అప్పులు తెచ్చింది. ట్విస్ట్ ఏంటంటే ఆ కార్పొరేషన్‌కు పైసా ఆదాయం లేదు. నయాపైసా ఆస్తి లేదు. అందుకే ...