ఐపీఎల్ ముగిసింది. క్రికెట్ ప్రేమికులకు కాస్తంత నిరాశే. కానీ.. ఈసారి మాత్రం కాదు. ఎందుకంటే.. మరో రోజులోనే టీ20 వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నెల 17న ప్రారంభమయ్యే ఈ టీ20 వరల్డ్ కప్ మీద భారీ అంచనాలే ఉన్నాయి.
యూఏఈ.. ఒమన్ వేదికలుగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభమవుతున్న వేళ.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లన్నింటిలోకి యావత్ ప్రపంచ క్రీడాభిమానులు ఎదురుచూస్తున్న మ్యాచ్ 24న జరగనుంది.
Naya #MaukaMauka, naya offer – #Buy1Break1Free! ????
Are you ready to #LiveTheGame in #INDvPAK?
ICC Men's #T20WorldCup 2021 | Oct 24 | Broadcast starts: 7 PM, Match starts: 7:30 PM | Star Sports & Disney+Hotstar pic.twitter.com/MNsOql9cjO
— Star Sports (@StarSportsIndia) October 13, 2021
ఆ రోజు భారత్ వర్సెస్ పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండేళ్ల క్రితం అంటే 2019లో వన్డే ప్రపంచ కప్ పోటీలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. మళ్లీ ఇన్నాళ్లకు మ్యాచ్ జరగుతుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి.
ఎప్పటిలానే.. తమ జట్టు గెలుస్తుందంటే తమ జట్టు గెలుస్తుందన్న మాటల యుద్ధమే కాదు.. ప్రకటన జోరు మొదలైంది. భారీ అంచనాలే కాదు.. టీ20 వరల్డ్ కప్ లో మోస్ట్ ఎగ్జైటింగ్ మ్యాచ్ గా దీన్ని భావిస్తున్నారు.
ఈ మ్యాచ్ కున్న ప్రాధాన్యత నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ టెలికాస్ట్ రైట్స్ ఉన్న సంస్థలు భారత్ – పాక్ మధ్య మ్యాచ్ పై ఒక ఆసక్తికర యాడ్ ను క్రియేట్ చేశారు. అందులో ఈ మ్యాచ్ లో భారత్ వైపే విజయం మొగ్గు చూపుతుందన్న భావన కలిగేలా చేసిన యాడ్ అందరిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
ఇంతకీ ఈ యాడ్ లో ఏముందంటే..
ఒక పాక్ అభిమాని దుబాయ్ లోని ఒక భారతీయుడు నిర్వహించే ఎలక్ట్రికల్ షాపుకు వెళతాడు. పాక్ జెర్సీని ధరించిన అభిమాని ఒకరు వెళ్లి.. తనకు ఒక మంచి టీవీ కావాలని అడుగుతాడు. టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతున్న వేళ.. పెద్ద టీవీలో మ్యాచ్ చూడాలని చెబుతాడు.
అక్కడితో ఆగని ఆ పాక్ అభిమాని.. ఈసారి తమ జట్టులో బాబర్ అజామ్.. రిజ్వాన్ లాంటి ఆటగాళ్లు ఉన్నారని.. అదగొట్టేస్తారని.. ఢిల్లీ (భారత్) కి చుక్కలు చూపిస్తారని.. కప్ కొట్టికెళతారంటూ గొప్పలు చెబుతారు. దీనికి నవ్వుతూనే స్పందిస్తాడు షోరూమ్ యజమాని అయిన భారతీయుడు.
ఒక టీవీ అడిగితే రెండు టీవీలా? అన్న పాక్ అభిమాని మాటకు.. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్ లో ఐదుసార్లు తలబడ్డాయని.. అందులో భారత్ అధిక్యత స్పష్టంగా కనిపించిందని.. ఒకవేళ పాక్ ఓడితే.. ఆ వేదనతో ఒక టీవీని పగలగొట్టినా.. మరో టీవీ ఉండాలి కదా? అందుకే.. బై వన్ బ్రేక్ వన్ ఫ్రీ అంటూ యజమాని చేసిన వ్యాఖ్యకు.. దాయాది బిక్కముఖం వేస్తాడు. దీంతో యాడ్ ముగుస్తుంది. ఈ యాడ్ కు భారతీయుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది.
ఇక.. గణాంకాల విషయానికి వస్తే భారత జట్టుతో దాయాది ఇప్పటివరకు వన్డే.. టీ20 వరల్డ్ కప్ మొత్తం 12 సార్లు తలబడగా.. అన్ని సందర్భాల్లోనే టీమిండియానే విజేతగా నిలిచింది. తాజా మ్యాచ్ లోనూ కోహ్లీ సేన తన చిరకాల ప్రత్యర్థిపై విజయం సాధిస్తుందన్న నమ్మకంతో అభిమానులు ఉన్నారు. మ్యాచ్ కు ముందు యాడ్ తో అదరగొట్టేశారని చెప్పాలి.