• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మ్యాగజైన్ స్టోరీ: జనంలోకి వెళ్లని ‘స్వర్ణాంధ్ర-2047’ పత్రం

admin by admin
March 25, 2025
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
13
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జాతీయ స్థాయిలో ‘వికసిత భారత’ లక్ష్యానికి సమాంతరంగా రాష్ట్రాన్నీ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో… ముఖ్యమంత్రి చంద్రబాబు ‘స్వర్ణాంధ్ర 2047’ పేరుతో ఒక విజన్‌ బుక్‌ తయారు చేయించారు. అది మంచిదే.. అందులో పేర్కొన్న లక్ష్యాలు కూడా ఉన్నతమైనవే! కానీ ప్రభుత్వ ఉద్దేశాలేంటో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో మాత్రం విఫలమయ్యారు. ఈ డాక్యుమెంట్‌పై జిల్లా, మండల స్థాయిలో చర్చ జరగాలని… పాఠశాలల్లోనూ విద్యార్థులకు అవగాహన కల్పించాలని… ప్రజాభిప్రాయాలూ తెలుసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

డాక్యుమెంట్‌లో ఉన్న 10 సూత్రాలను.. అంశాల వారీగా గ్రామస్థాయిలో చర్చకు పెట్టాలని ప్రజాప్రతినిధులను పలుమార్లు ఆదేశించారు. ఒకరికి చెప్పాలంటే… ముందు ప్రజాప్రతినిధులకు, అధికారులకు అర్థం కావాలి కదా! అందుకే… 230 పేజీల విజన్‌ డాక్యుమెంట్‌ను అర్థం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. కానీ ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలు కేపీఎంజీ, బీసీజీ (బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌) రూపొందించిన ఈ డాక్యుమెంట్‌లోని ప్రపంచ స్థాయి ఇంగ్లిష్‌ భాష వారినే హడలగొడుతోంది.

1995-2004 నడుమ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో విజన్‌-2020 విడుదల చేశారు. అది కూడా ప్రపంచ బ్యాంకు ‘భాష’లో ఉన్నప్పటికీ ప్రజలకు కొంత దగ్గరైంది. రంగాల వారీగా ప్రభుత్వం నిర్దేశించుకున్న స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు.. వాటిని చేరుకునే మార్గాలను అందులో పొందుపరిచారు. పూర్తిస్థాయిలో కాకున్నా… స్థూలంగా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యాలు, ఎంచుకున్న మార్గాలు అప్పట్లో ప్రజలకు అర్థమయ్యాయి. ఇప్పుడు ‘స్వర్ణాంధ్ర-2047’ దీనికి పూర్తి భిన్నంగా ఉంది.

సాధారణంగా ప్రభుత్వం తాను ప్రచారం చేయదలుచుకున్న అంశాలను సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో, పంచ్‌లైన్లతో, ప్రాసలతో తయారు చేయిస్తుంది. ఒక్కసారి విన్నా, చూసినా గుర్తుండిపోయేలా ఉంటాయి. కానీ స్వర్ణాంధ్ర-2047 డాక్యుమెంట్‌లో ఉన్న భాషను అర్థం చేసుకోలేక అధికారులు, ప్రజాప్రతినిధులు తంటాలు పడుతున్నారు. ప్రభుత్వ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే మీడియాకైనా కనీసం అర్థమయ్యేలా వివరించి ఉంటే అసలు ఉద్దేశం ప్రజలకు చేరేది. దానిపై వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలు ప్రభుత్వానికి తెలిసేవి. కానీ ఇప్పుడా అవకాశమే లేకుండా పోయింది.

కార్యదర్శుల సదస్సులోనూ…

శాఖల కార్యదర్శుల సదస్సు జరిగిన రోజు ఇచ్చిన ప్రజెంటేషన్లలో వాడిన భాష కూడా విజన్‌ డాక్యుమెంట్‌లో మాదిరే ఉంది. ప్రపంచ స్థాయి కన్సల్టెంట్ల భాష వాడారు. పీజీఆర్‌ఎస్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో చెప్పారు గానీ, పరిష్కారం అయిన ఫిర్యాదులను జిల్లాల వారీగా చెప్పలేకపోయారు. ఫిర్యాదుల తీరుతెన్నుల గురించి రాసిన లెక్కలనే పదిసార్లు రాశారు. హీట్‌మ్యాప్‌, హౌస్‌హోల్డ్‌ గ్రీవెన్సెస్‌, ఎస్‌ఎల్‌ఏ అంటూ.. అది తయారు చేసిన వారికి తప్ప ఎవరికీ అర్థం కాని భాషలో రంగు రంగుల గ్రాఫ్‌లతో నింపేశారు. మొత్తం 7,42,301 ఫిర్యాదులు వస్తే 4,50,735 పరిష్కరించామని చెప్పారు.

ఇందులో కనీసం పది మందితో అయినా ‘మా ఫిర్యాదులు పరిష్కారమయ్యాయి’ అని వారి మాటల్లో చెప్పించి, వాటిని ప్రజెంటేషన్‌లో చూపించి ఉంటే ఈ లెక్కలు నమ్మశక్యంగా ఉండేవి. అయితే అర్థం కాని పదాలతో రంగురంగుల గ్రాఫ్‌లతో మమ అనిపించేశారు.

విజన్‌ లక్ష్యాలు ఘనమే..!

విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, నీతీఆయోగ్‌, ఇంకా ఇతర సంస్థల ప్రతినిధులు.. ఇలా మొత్తం 17 లక్షలమందిని స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనలో భాగస్వాములను చేశారు. అవగాహన కోసం 4.50 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు, 38 వేలమంది కళాశాల విద్యార్థులకు పోటీలు కూడా నిర్వహించారు. జాబ్‌ ఫస్ట్‌ విధానంతో ఇండసీ్ట్రయల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ, ఎంఎస్‌ఎంఈ, పుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలకా్ట్రనిక్‌, ప్రైవేట్‌ పార్క్‌లు, సెమీకండక్టర్‌, క్లీన ఎనర్జీ, డ్రోన, డేటా సెంటర్‌, స్పోర్ట్స్‌, టూరిజం తదితర 20 పాలసీల సమాహారాన్ని పొందుపరిచారు.

ఆరోగ్యం.. సంపద.. సంతోషాలే లక్ష్యంగా దీనికి రూపకల్పన చేశారు. ‘పది సూత్రాలతో విజన డాక్యుమెంట్‌ రూపకల్పన చేశాం. జీరో పావర్టీ (పేదరిక సంపూర్ణ నిర్మూలన) కోసం ఎన్టీఆర్‌ కలలు గనేవారు. పీపుల్‌, పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌(పీ4)అనే విధానం ద్వారా నిరుపేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తాం. ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త అనేది నా సంకల్పం. 2047 నాటికి ఇది తప్పక నెరవేరుతుంది. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తున్నాం. ఇందుకు పాలసీలు తెస్తున్నాం. మంచి పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహిస్తున్నాం.

జనాభా నిర్వహణపై దృష్టి సారించాం. రాష్ట్రంలో నాలెడ్జి సొసైటీని తయారుచేసుకోవాల్సిన అవసరముంది. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందేలా అభివృద్ధి వికేంద్రీకరణ ప్రక్రియను చేపడతాం’ అని చంద్రబాబు అన్నారు. మరి ఇంత ఘనంగా రూపొందించుకుని ప్రజలకు అర్థమయ్యేలా ఎందుకు చెప్పలేకపోతున్నారు? కనీసం మంత్రులైనా తమ సమీక్షల్లో వీటి ప్రస్తావన తెస్తున్నారా? చంద్రబాబు, సీఎస్‌ తప్ప దీని గురించి మాట్లాడేవారే కనిపించడం లేదు. అధికారులకే కష్టంగా ఉన్నప్పుడు ఇక సామాన్యులకు ఎలా అర్థమవుతుంది? ఇదే విజన్‌ను కేంద్రానికి కూడా పంపించారు.

అక్కడి వారికి ఇది అర్థమైందో లేదో తెలియదు గానీ.. జనంలోకి తీసుకెళ్లకపోతే మాత్రం అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉంది. విజన్‌-2020 రూపొందించినప్పుడు కూడా దానిని సక్రమంగా ప్రజలకు చేర్చలేకపోయారు. ఎంతసేపూ అధికారులతో ఆ దిశగా చర్చలు జరిపితే చాలదు.. అదెంతవరకు ప్రజలకు చేరువైందో తెలుసుకోకుంటే ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసినా ప్రయోజనం ఉండదని పాలనా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Tags: cm chandrababulanguage problemnot understandableswarnandhra 2047 document
Previous Post

నిరుద్యోగుల‌కు చంద్ర‌బాబు గుడ్ న్యూస్‌

Next Post

మ్యాగజైన్ స్టోరీ: సెకీ ఒప్పందంపై జగన్ నీచ పత్రిక అసత్యాలు

Related Posts

Andhra

పాస్టర్ ప్రవీణ్ మృతిపై బాబు, లోకేశ్ రియాక్షన్

March 26, 2025
Andhra

తమను తిట్టినోడితో బాబు, లోకేశ్ షేక్ హ్యాండ్

March 26, 2025
Andhra

కొడాలి నాని కి గుండె పోటు.. వైసీపీ శ్రేణులు ఆందోళ‌న‌!

March 26, 2025
Movies

న‌టి సుహాసిని కి అలాంటి జ‌బ్బు.. ప‌రువు పోతుంద‌ని..?

March 26, 2025
Andhra

మ్యాగజైన్ స్టోరీ: చంద్రబాబు కు ‘భూ’ముప్పు!!

March 25, 2025
Andhra

మ్యాగజైన్ స్టోరీ: సెకీ ఒప్పందంపై జగన్ నీచ పత్రిక అసత్యాలు

March 25, 2025
Load More
Next Post

మ్యాగజైన్ స్టోరీ: సెకీ ఒప్పందంపై జగన్ నీచ పత్రిక అసత్యాలు

Latest News

  • పాస్టర్ ప్రవీణ్ మృతిపై బాబు, లోకేశ్ రియాక్షన్
  • తండేల్ టికెట్ రేట్ల పెంపు…ఇండస్ట్రీ ఏం నేర్చుకోలేదా?
  • త్రివిక్రమ్-బన్నీ సినిమా గురించి కీలక అప్‌డేట్
  • వార్న‌ర్ ఇష్యూ.. రాజేంద్ర‌ప్ర‌సాద్ రియాక్ష‌న్ వైర‌ల్!
  • తమను తిట్టినోడితో బాబు, లోకేశ్ షేక్ హ్యాండ్
  • కొడాలి నాని కి గుండె పోటు.. వైసీపీ శ్రేణులు ఆందోళ‌న‌!
  • న‌టి సుహాసిని కి అలాంటి జ‌బ్బు.. ప‌రువు పోతుంద‌ని..?
  • మ్యాగజైన్ స్టోరీ: చంద్రబాబు కు ‘భూ’ముప్పు!!
  • మ్యాగజైన్ స్టోరీ: సెకీ ఒప్పందంపై జగన్ నీచ పత్రిక అసత్యాలు
  • మ్యాగజైన్ స్టోరీ: జనంలోకి వెళ్లని ‘స్వర్ణాంధ్ర-2047’ పత్రం
  • నిరుద్యోగుల‌కు చంద్ర‌బాబు గుడ్ న్యూస్‌
  • ఇక జర్నలిస్టులు అనే జీవులు కనిపించకుండా పోతారా..?!
  • మూడేళ్లు ఆగు.. ఆ డీఎస్పీతోనే సెల్యూట్ కొట్టిస్తా: జ‌గ‌న్‌
  • 4 రోజుల్లో మంత్రివర్గ విస్తరణకు చంద్రబాబు రెడీ?
  • బిజీ బిజీగా వైసీపీ నేత‌లు.. లిస్ట్‌లో చేరిన‌ కాకాణి!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra