ఏపీలో వైసీపీ ఘోర ఓటమి విషయంలో ఇంకా ఆ పార్టీ నాయకులు కారణాలు వెతుక్కునే పనిలో ఉన్నా రు. మరికొందరు ఇప్పటికే బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. అందరూ జగన్ వైపే వేళ్లు చూపిస్తున్నా రు. ఇప్పుడు తాజాగా జగన్కు అత్యంత విశ్వాసపాత్రుడైన.. స్వామి విశాఖలో శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. జగన్ ఓటమికి ఆయన కూడా కొన్నికారణాలు చూపించారు. అయితే.. ఆయన నేరుగా జగన్ పేరు ఎత్తలేదు.
కానీ, తప్పులు మాత్రం ఎత్తి చూపించారు. తాజాగా సోమవారం స్వరూపానందేంద్ర మీడియాతో మాట్లాడు తూ.. గతంలో తాము చెప్పినట్టు ప్రభుత్వం వినలేదని ఆరోపించారు. శ్రీశైలంలో మహా కుంభాభిషేకం చేయొద్దని ఆపించామని చెప్పారు. అయితే.. తన మాట వినకుండా.. ఉత్తరాయణ కాలంలో కుంభాభి షేకం నిర్వహించారని.. ఈ విషయంలో కోర్టును మేనేజ్ చేశారని స్వామి ఆరోపించారు. ఫలితం ఎలా వచ్చిందో చూశారుగా! అని అన్నారు.
ఇక, తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం లక్షల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగుతుం దని స్వామి తెలిపారు. ఈ ప్రసాదంలో కొన్ని సంవత్సరాలుగా అన్నమే వడ్డిస్తున్నారని.. కానీ, గత(జగన్) ప్రభుత్వం తృణ ధాన్యాలు వండి వడ్డిందని.. ఇది తగదని తాను వారించానని.. అన్నారు. అయినా తన మాట వినలేదని.. కనీసం తన సలహా కూడా పట్టించుకోలేదని .. ఫలితం ఎలా వచ్చిందో చూశారుగా! అని స్వామి చెప్పుకొచ్చారు. మొత్తంగా ఆయన జగన్ హయాంలో తాను ఇచ్చిన సలహాలు కూడా పాటించలేదని తేల్చారు.
ఇక, స్వామి ఈ సందర్భంగా మరో మాట కూడా చెప్పారు. తాము ఏ ప్రభుత్వానికి అనుకూలం కాదని చెప్పు కొచ్చారు. ఏ ప్రభుత్వమైనా.. తాము హిందూత్వం వైపే నిలబడ్డామని.. భక్తులు, రాష్ట్రమే తమకు ప్రాధాన్య మని ఈ విషయంలో మీడియా అధిపతులకు కూడా తెలుసునని వ్యాఖ్యానించారు. ఎక్కడా తాము గీత దాటి వ్యవహరించలేదన్నారు. ఆస్తులు పోగేసుకునేందుకు ప్రయత్నించలేదని చెప్పారు. తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.