ఏపీలో టికెట్ రేట్లు పెంచలేదంట…తెలంగాణలో అయితే ఉన్న రేట్లకన్నా ఎక్కువ అమ్ముకోవచ్చని చెప్పారంట…ఇపుడు, ఏపీ, తెలంగాణలో ఏ ఇద్దరు కలిసినా…దాదాపుగా ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.
ఎందుకంటే, జనానికి ప్రధాన వినోద సాధనం సినిమా. కాబట్టి రేట్లు తగ్గించినా..పెంచినా….సినిమా హిట్ అయినా…ఫట్ అయినా…చర్చ మాత్రం కామన్.
ఇక, ఏపీలో టికెట్ల రేట్ల వ్యవహారం మంత్రులు వర్సెస్ హీరో నాని అన్న చందంగా మారింది.
అయితే, టికెట్ రేట్లపై నాని కంటే ముందే బాహాటంగా తన అభిప్రాయాన్ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొద్దిరోజుల కిందటే వ్యక్తపరిచారు.
తగ్గించిన టిక్కెట్ రేట్లు వల్ల నిర్మాత లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,రేట్లపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని అన్నారు.
కరోనా టైంలో ప్రేక్షకులు థియేటర్లకు రావడమే కష్టంగా ఉందని, ఇక టికెట్ రేట్లు తగ్గిస్తే థియేటర్లు మూసుకోవడమేనని అన్నారు.
బి, సి సెంటర్స్ లో కనీసం కరెంటు చార్జీలు కూడా వచ్చే అవకాశాలు లేవని, నిర్మాతకు దాని ధర నిర్ణయించుకునే అవకాశం ఉండాలని సురేష్ బాబు అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలోనే తాజాగా సురేష్ బాబు థియేటర్ల వ్యవహారంపై కామెంట్లు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వైజాగ్ లోని స్థలాల వ్యవహారం తన వ్యక్తిగతమని, ఆ వ్యవహారాన్ని తానే సాల్వ్ చేసుకోగలనని, దాన్ని ఇండస్ట్రీకి ముడిపెట్టి అందరి సాయం అడిగేంత చాతగానోణ్ణేమీ కాదని సురేష్ బాబు అన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఆల్రెడీ తనవి 80% థియేటర్స్ మూసేశానని, అవసరమైతే ఇకపై తీసే సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ చేస్తానని సురేష్ బాబు అన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తనకు సినిమా ప్యాషనేమీ కాదని, లేదంటే సినిమాలే మానేస్తా నని, అంతేగానీ బెదిరింపులకి తలొగ్గే వ్యక్తిని కాదని సురేష్ బాబు అన్నట్లు పుకార్లు వ్యాపిస్తున్నాయి.
తన నిర్ణయంలో ఏ మార్పూ ఉండదని సురేష్ బాబు చెప్పినట్లు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి
గూగుల్ న్యూస్‌లో నమస్తే ఆంధ్రను ఫాలో కావడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Look new free site [url=https://bit.ly/3nCpO6A]Slut Porn Tube[/url]
Hot new site [url=https://bit.ly/3yGz9At]Slut Teen Tube[/url] present hardcore videos for free