సాధారణ ప్రజలకు సురేఖ వాణి బాగా తెలుసు.
కానీ సోషల్ మీడియా ప్రజలకు సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా బాగా తెలుసు.
తరచు తల్లీ కూతుళ్లు సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంటారు.
కూతురుపై రకరకాలుగా తన ప్రేమను వ్యక్తంచేస్తూ సురేఖ వాణి సంతోషపడుతుంది.
తన కూతరు 21 వ పుట్టిన రోజునాడు గోవాలో సురేఖ వాణి ప్రత్యేక పార్టీ ఏర్పాటుచేసింది.
దానికి కూతురు స్నేహితులను కూడా ఆహ్వానించింది.
అయితే ఇదంతా కూతురికి తెలియకుండా చేసి సర్ ప్రైజ్ చేసింది.
తల్లీ కూతుళ్లు చేసిన రచ్చను ఈ వీడియలో చూడొచ్చు.
సురేఖ వాణి కూతురు సుప్రీతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది
నా గుండె చప్పుడైన నీకు నా హృదయంలో ఎప్పటీకీ చోటు ఉంటుందంటూ కూతురికి ట్వీట్ చేసింది సురేఖ వాణి.
కూతురు సుప్రీత త్వరలో ఓ స్టార్ హీరో సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.