పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ శుక్రవారం తిరస్కరించింది. పిటిషన్లో కొన్ని లోపాలు ఉన్నందున దరఖాస్తును అంగీకరించడానికి నిరాకరించింది.
పిటిషనులో తప్పులు సరిచేసిన తరువాత పిటిషన్ను మళ్లీ సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సమర్పించారు. అయితే… పిటిషన్ తిరిగి సమర్పించే సమయానికి ఆలస్యం కావడంతో శుక్రవారం పిటిషను విచారణకు రాలేదు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఇదిలావుండగా, ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఎన్నికలు వద్దని ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం… సింగిల్ బెంచ్ తీర్పు ఎన్నికల రద్దును ఆదేశించడం, ఆ తర్వాత నిమ్మగడ్డ పిటిషను వేయడం, ధర్మాసనం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎలాగైనా ఎన్నికలు ఆపాలనే పట్టుదలతో సుప్రీంకోర్టుకు వెళ్లింది. చివరకు పిటిషను లో కూడా తప్పులే ఉండటంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది.
కోటానుకోట్లు తీసుకుంటున్న జగన్ లాయర్లకు పిటిషను తప్పుల్లేకుండా ఫైల్ చేయడం రావడం లేదా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.