ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం అమలుపై సుప్రింకోర్టు కీలకమైన తీర్పిచ్చింది. నాలుగు గోడల మధ్య జరిగే వ్యవహరంపై ఫిర్యాదు వచ్చినా లేదా తగిన సాక్ష్యం లేకపోయినా ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం క్రింద ఎవరిపైనా కేసులు నమోదు చేసేందుకు లేదంటూ స్పష్టంగా చెప్పింది. గది నాలుగు గోడల మధ్య తనను బెదిరించారని, వేధించారనే ఆరోపణలతో ఎవరైనా ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం క్రింద కేసు నమోదు చేయటానికి వీల్లేదని చెప్పేసింది. ఇదే ఆరోపణలపై ఉత్తరాఖండ్ లోని ఓ వ్యక్తిపై నమోదైన కేసును సుప్రింకోర్టు కొట్టేసింది.
విషయం ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు సుప్రింకోర్టు అభిప్రాయపడింది. తనింట్లోకి వచ్చి తనను కులం పేరుతో దూషించారనో, లేకపోతే కులంపేరు చెప్పి దూషించారనో ఎవరైనా ఎవరిపైనైనా కేసు పెడితే అందుకు సాక్ష్యాలను చూపించాల్సుంటుందని సుప్రింకోర్టు చెప్పింది. అయితే తన ఫిర్యాదుకు మద్దతుగా కుటుంబసభ్యుల సాక్ష్యాలు కూడా చెల్లవన్నట్లుగానే సుప్రింకోర్టు స్పష్టం చేసింది.
ఒకవ్యక్తి ఓ ఎస్సీ, ఎస్టీ వ్యక్తిని వేధిస్తున్నాడనేందుకు బహిరంగ ప్రదేశంలో తగిన సాక్ష్యాలుంటేనే కేసులు నమోదు చేయాలని చెప్పటం సంచనలంగా మారింది. బహిరంగ ప్రదేశాలు, బహిరంగంగా ప్రజల దృష్టిలో పడేట్లుగా జరిగితేనే ఎస్సీ, ఎస్టీ వేధింపుల ఫిర్యాదును తీసుకుని కేసు పెట్టాలంటూ చెప్పేసింది. ఉత్తరాఖండ్ లో వర్మ అనే వ్యక్తి తనింటికి వచ్చి తనను వేధించాడని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల క్రింద కేసు ఎలా పెడతారంటూ సుప్రింకోర్టు నిలదీసింది. పైగా ఇదే కేసు ఉత్తరాఖండ్ హైకోర్టులో విచారణకు వచ్చినపుడు కేసు కొట్టేసింది. ఫిర్యాదు చేసిన వాళ్ళదే కరెక్టన్నట్లుగా హైకోర్టు తీర్పించ్చింది. దాంతో వర్మ సుప్రింకోర్టుకెక్కారు.
కేసు మొత్తాన్ని విచారించిన సుప్రింకోర్టు తగిన సాక్ష్యాలు లేదంటు కేసును కొట్టేసింది. విషయం ఏమిటంటే వర్మకు కేసు పెట్టిన వ్యక్తికి మద్య ఆస్తి తగాదాలున్నాయని బయటపడింది. ఆ విషయమై మాట్లాడాటానికి వెళితే వర్మపై కేసు పెట్టారు. తనను వేధించారని సాక్ష్యులుగా తన కుటుంబసభ్యులను చూపించారు. దాంతో కుటుంబసభ్యుల సాక్ష్యాలు చెల్లవంటు కేసును సుప్రింకోర్టు కొట్టేసింది.
నిజానికి ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుండో ఉన్నదే. తాజాగా సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పుతో అయినా కేసును దుర్వినియోగం చేయటం తగ్గుతుందేమో చూడాలి.