ఆయేషా టాకియా అంటే గుర్తుకు రావడం కష్టమే. కానీ సూపర్ మూవీ హీరోయిన్ అంటే మాత్రం తెలుగు వారి మదిలో ఆమె రూపం టక్కున మెదులుతుంది. నాగార్జునను హీరోగా పెట్టి పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ తో ఆయేషా టాకియా, అనుష్క శెట్టి టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. అనుష్కు పెద్దగా గుర్తింపు రాకపోయినా.. ఆయేషా మాత్రం తన గ్లామర్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
కానీ ముంబై ముద్దుగుమ్మ సూపర్ తర్వాత తెలుగులో ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. బాలీవుడ్ లోనే నటించింది. 2011 నుంచి యాక్టింగ్ కెరీర్ కు గుడ్ బై చెప్పేసిన ఆయేషా.. 23 ఏళ్ల వయసులో సమాజ్వాది పార్టీ నాయకుడు, వ్యాపారవేత్త అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్ అజ్మీని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా పుట్టాడు.
అయితే ఇండస్ట్రీకి దూరం అయ్యాక ఆయేషా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో క్యూట్ గా ఉన్న ఈ భామ ఇప్పుడెలా ఉందో చూస్తే కచ్చితంగా షాక్ అవుతారు. తాజాగా ఆయేషా టాకియా నీలం రంగు చీర కట్టుకుని ట్రెడిషనల్ లుక్ లో ఉన్న తన లేటెస్ట్ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటో చూసి `ఏయే ఆయేషా నువ్వేనా..? ఇలా ఎందుకు మారిపోయావ్..? నీకు ఏమైంది..?` అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. కొందరైతే ఆయేషాపై ట్రోలింగ్ కూడా షురూ చేశారు. దెబ్బకు భయపడిపోయిన ఆమె తన ఇన్స్టా అకౌంట్ ను డిలీట్ చేసుకుంది. కాగా, ప్లాస్టిక్ సర్జరీల వల్లే ఆయేషా గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని ప్రచారం జరుగుతోంది.