అనుమానం.. పెనుభూతంగా మారింది. మానవ సహిత అంతరిక్ష ప్రయోగం అర్థాంతరంగా ముగిసింది. అంతరిక్షంలోకి వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ సేఫ్‌గా భూమికి తిరిగి వచ్చింది. కానీ, దీనిలో వెళ్లిన అమెరికా అంతరిక్ష వ్యోమగాములు.. సునీతా విలియమ్స్, విల్ మోర్ మాత్రం తిరిగి రాలేక పోయారు. దీనికి కారణం.. `అనుమానం`. ఫలితంగా వారు భూమి మీదకు వచ్చేందుకు మరో రెండు మాసాల సమయం పట్టే అవకాశం ఏర్పడింది.
అసలు ఏం జరిగింది?
గత జూన్‌లో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం చేపట్టిన ప్రైవేటు సంస్థ.. బోయింగ్. ఇది అమెరికా సంస్థ. బోయింగ్ స్టార్ లైనెర్ పేరుతో అంతరిక్షంలోకి ఇద్దరు వ్యోమగాములను పంపించింది. ఇది తదుపరి వారంలోనే తిరిగి భూమికి చేరుకోవాల్సి ఉంది. అయితే.. స్టార్ లైనర్లోసమస్యలు తలెత్తాయి. దీంతో వేరే దానిలో అయినా సునీత, విల్ మోర్లను భూమికి తీసుకురావాలని భావించారు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌ను సంప్రదించారు. కానీ, బోయింగ్‌కు.. ఎక్స్‌కు విభేదాలు ఏర్పడి.. ఇది ఆలస్యమైంది.
చివరకు బోయింగ్ తన సాంకేతిక సమస్యలు అధిగమించింది. స్టార్ లైనర్ నుంచి లీకవుతున్న హీలియంను అరికట్టింది. అంతా రెడీ అనుకున్న సమయంలో అమెరికా అంతరిక్ష సంస్థ.. మీరు రావాలనుకుంటే వచ్చేయండి.. వ్యోమగాములను మాత్రం తీసుకురాకండి.. అని తేల్చి చెప్పింది. అంటే.. బోయింగ్‌పై అనుమానాలు నివృత్తి కాలేదు. దీనిపై గత వారం అనేక చర్చలు కూడా జరిగాయి. అయినా.. నాసా ససేమిరా అంది.
దీంతో చివరకు బోయింగ్ తన వాహక నౌకను వెనక్కి తీసుకువచ్చేసింది. శుక్రవారం రాత్రి బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమిని చేరింది. న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో సురక్షితంగా కిందకు దిగింది. కానీ, దీనిలో ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వక పోవడంతో సునీతా విలియమ్స్, విల్ మోర్లో అమెరికా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. వారు వచ్చేందుకు.. మరో రెండు మాసాల సమయం పట్టనుంది. ప్రస్తుతం స్పేక్స్ క్రూ-9 మిషన్‌లో `క్రూ డ్రాగన్` తయారవుతోంది. ఇది పూర్తయ్యాక కానీ.. వారు భూమి మీదకు వచ్చే అవకాశం లేదు.