టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం `మజాకా` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. త్రినాధరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సందీప్ కిషన్ కు జోడిగా రీతు వర్మ నటించగా.. రావు రమేష్, ఒకప్పటి స్టార్ బ్యూటీ అన్షు ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మితమైన మజాకా ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కిషన్.. మజాకా విశేషాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా పంచుకున్నాడు.
ఈ క్రమంలోనే తనకు సైనస్ వ్యాధి ఉందన్న విషయాన్ని సందీప్ కిషన్ బయటపెట్టాడు. ఈ వ్యాధితో చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నానని.. సైనస్ వల్ల పడుకున్నప్పుడు ముక్కు నుండి వెనక భాగం వరకు బ్లాక్ అవుతుందని, దాంతో ఒక్కోసారి తీవ్రమైన బ్రీతింగ్ ఇష్యూస్‌ను ఫేస్ చేస్తుంటానని సందీప్ కిషన్ తెలిపారు. అలాగే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఎవ్వరితోనూ మాట్లాడలేనని.. కనీసం ఇంట్లో అమ్మనాన్నలతో కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటుందని అన్నాడు.
వేడి వేడి టీ తాగి, మెడిటేషన్ చేస్తూ చిన్న చిన్న వ్యాయామాలు చేశాక మాట్లాడతా అని సందీప్ కిషన్ తెలిపాడు. ఇక తన సమస్యకు సర్జరీ చేయించుకోవాలి.. అయితే ఆపరేషన్ చేయించుకుంటే ముక్కు మారిపోతుందని, ముఖం మారిపోతుందని భయమేసి చేయించుకోవడం లేదంటూ సందీప్ కిషన్ చెప్పుకొచ్చాడు. కాగా, సందీప్ కిషన్ ఓవైపు నటుడిగా కొనసాగుతూనే.. మరోవైపు వ్యాపారవేత్తగా సత్తా చాటుతున్నాడు. హైదరాబాద్‌లో `వివాహ భోజనంబు` అనే రెస్టారెంట్ చైన్ ను సందీప్ నడుపుతున్నాడు.