రఘురామరాజు వ్యవహారం రోజురోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది.
ఈ విషయాన్ని రఘురామరాజు ఆషామాషీగా వదలడం లేదు.
జగన్ పాలన ఎలా ఉందో, ఆయన అణచివేత ఎలాగుంటుందో దేశ వ్యాప్తంగా అందరికీ తెలిసేలా చేస్తున్నారు.
ఆయన పాలనలో పోలీసు వ్యవస్థ పనితీరు గురించి దేశమంతటికీ చెబుతున్నారు.
ఏకంగా పార్లమెంటు సభ్యులను ఏకతాటిపైకి తెచ్చి అసలు దేశద్రోహం సెక్షన్ పైనే ప్రత్యేక నిరసన రూపొందిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన ప్రతి ఎంపీకి లేఖ రాశారు. ఆ లేఖ అందిన ఎంపీలు ఒక్కొక్కరు తీవ్రంగా స్పందిస్తున్నారు.
జగన్ పాలన ఇలా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
ఒకప్పటి ప్రముఖ తెలుగు నటి, ఎంపీ సుమలత అంబరీష్ జగన్ సర్కారుపై దుమ్మెత్తిపోశారు. అదేంటో ఆమె మాటల్లోనే చదవండి.
In utter shock & disbelief at the third-degree torture meted out in police custody to sitting Loksabha MP @RaghuRaju_MP , unless they take immediate remedial measures,this ll reflect very badly on the #APpolice & Govt.I stand with my colleague & condemn this act. pic.twitter.com/LUHKjSusez
— Sumalatha Ambareesh ???????? ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ (@sumalathaA) June 4, 2021
సిట్టింగ్ లోక్ సభ ఎంపీకి ఏపీ పోలీసులు థర్డ్ డిగ్రీ తో శిక్షించడమా?
పోలీసు కస్టడీలో ఒక ఎంపీపీపై ఇలా జరగడం దేశానికే ప్రమాదం.
దీనిపై వెంటనే తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే ఏపీ పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
రఘురామరాజుపై జరిగిన ఈ హింసను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఆమె స్పందించారు.
===
ఇక నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మాణిక్యం టాగూర్ కూడా జగన్ సర్కారుపై తీవ్రంగా స్పందించారు.
Shocked to see the letter from my Loksabha colleague @RaghuRaju_MP .It’s cruel and utter madness from the AP police.Ideologically I differ from Sh Raghugaru but when a Parliamentarian it can happens,what will happen to any ordinary political workers in Andhra. It’s Hitlerraj? ???? pic.twitter.com/6P1n44x4mY
— Manickam Tagore .B????????மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) June 3, 2021