-రెండు నెలలుగా పోరాడి పరీక్షలు రద్దు చేయించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి
-80 లక్షల మందిని కోవిడ్ ముప్పు తప్పించిన లోకేష్‌పై ప్రశంసల జల్లు
-అలుపెరుగుని పోరాటం చేసిన నారా లోకేష్‌ని అభినందిస్తోన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
-పరీక్షలు రద్దు కోసం ఏప్రిల్ 18న ఉద్యమానికి దిగిన నారా లోకేష్ జూన్ 24న విజయం సాధించారు
-లేఖలు, డిజిటల్ ఉద్యమం, న్యాయ మార్గాలలో రాజీలేని పోరు సాగించిన నారా లోకేష్
-విద్యార్థుల కోసం పోరాడి మూర్ఖపు జగన్‌రెడ్డి మెడలు వంచి మరీ గెలిచి చూపించిన లోకేష్ శెహభాష్ అంటున్నారు
రెండు నెలలుగా పరీక్షల రద్దు కోసం అలుపెరగకుండా పోరాడి విజయం సాధించిన నారా లోకేష్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కోవిడ్ ముప్పు నుంచి లక్షలాది మంది విద్యార్థుల తప్పించిన అసలు సిసలైన మేనమామగా నారా లోకేష్ ఏపీ విద్యార్థుల మనసులు గెలుచుకుని హీరో అవ్వగా, కోవిడ్‌తో బలి చేసేందుకు కూడా వెనుకాడని మెంటల్మామగా జగన్‌రెడ్డి విద్యార్థుల పాలిట విలన్‌గా మారారు. కోవిడ్ తీవ్రతపై నిపుణుల హెచ్చరికలు, అంతర్జాతీయ అధ్యయనాలు, దేశీయ శాస్త్రవేత్తలు, వైద్యులు హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ …కోవిడ్ తీవ్రతలో పరీక్షలు వద్దంటూ తొలిసారిగా ప్రభుత్వానికి లేఖ రాయడం ద్వారా తన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్లు, విద్యావేత్తలు కూడా కరోనా సంక్షోభ సమయంలో పరీక్షలు నిర్వహించొద్దని వేలాది మంది వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించి పరీక్షలు రద్దు చేయాలని ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
నారా లోకేష్ వినతులు పంపిన నాడే పరీక్షలు రద్దు చేసి వుంటే కోర్టులలో ఏపీ సర్కారు దోషులుగా నిలబడేది కాదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్రం సీబీఎస్ఈతోపాటు అన్ని పరీక్షలు రద్దుచేసుకోగా, దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ బోర్డు పరీక్షలు రద్దు చేశాక కూడా…పరీక్షలు రద్దు చేయకుండా మొండిగా మూర్ఖంగా పరీక్షల నిర్వహణకి వెళ్లడం..అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురి కావాల్సిన దుస్థితి ఏర్పడింది. కేవలం నారా లోకేష్ విద్యార్థుల తరఫున పోరాడుతున్నారని, పరీక్షలు రద్దు చేస్తే క్రెడిట్ లోకేష్‌కి వెళుతుందనే కక్షతో 80 లక్షల మందిని కోవిడ్‌కి బలిపెట్టడానికి సిద్ధమైన జగన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక పద్ధతి ప్రకారం పరీక్షలు రద్దు చేయాల్సిన ఆవశ్యకతని వివరిస్తూ నారా లోకేష్ సీఎంకి, గవర్నర్‌కి లేఖలు రాశారు. వినతిపత్రాలు పంపారు. డిజిటల్ టౌన్ హాల్ మీటింగ్‌ల ద్వారా సేకరించిన లక్షలాది విద్యార్థుల అభిప్రాయాలను నివేదించారు. అయినా ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్లింది. చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో పరీక్షలు రద్దు చేసింది జగన్‌రెడ్డి ప్రభుత్వం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పరీక్షల నిర్వహణ సిబ్బంది ప్రాణాల రక్షణే ధ్యేయంగా నారా లోకేష్ సాగించిన పోరాటం విజయం సాధించారు. పరీక్షల రద్దు ఉద్యమం సాగింది ఇలా…
ఏప్రిల్ 18
విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల ఆందోళన దృష్ట్యా పరీక్షలు రద్దు చేయాలి లేదా వాయిదా వెయ్యాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏప్రిల్ 18 న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి మొదటి లేఖ రాశారు.
ఏప్రిల్ 20
టిఎన్ఎస్ఎఫ్,విద్యార్థి సంఘాల నేతలు,విద్యావేత్తలు,న్యాయవాదులతో ప్రభుత్వంపై పోరాట ప్రణాళిక సిద్ధం చేసేందుకు నారా లోకేష్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 22
రాష్ట్రంలో ఉన్న విద్యావేత్తలు,డాక్టర్లు,తల్లిదండ్రులు,విద్యార్థులతో నారా లోకేష్ టౌన్ హాల్ కార్యక్రమం నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకొని ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ ఇచ్చారు.
ఏప్రిల్ 24
48 గంటల డెడ్ లైన్ పూర్తి అయిన సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన నారా లోకేష్.విద్యార్థుల జీవితాలతో ఆటలొద్దు ఇతర రాష్ట్రాల తరహాలో పరీక్షలు రద్దు చెయ్యాలి,అత్యధిక కేసులు మే లో నమోదు అవుతాయి అని నిపుణులు చెబుతున్న సమయంలో పరీక్షల నిర్వహణ మంచిది కాదంటూ మరో సారి ప్రభుత్వాన్ని లోకేష్ హెచ్చరించారు.
ఏప్రిల్ 26
పరీక్షలపై విద్యార్థులు,తల్లిదండ్రుల అభిప్రాయాలు, వారి ఆందోళన వివరిస్తూ ఆధారాలతో సహా 1778 పేజీలలో గౌరవ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కి లేఖరాసి జోక్యం చేసుకోవాలని లోకేష్ విన్నవించారు.
రాష్ట్రంలో ఉన్న విద్యావేత్తలు,డాక్టర్లు,తల్లిదండ్రులు,విద్యార్థులతో నిర్వహించిన టౌన్ హాల్ కార్యక్రమంలో అందరి అభిప్రాయం మేరకు న్యాయ పోరాటం చెయ్యాలని నిర్ణయం.
ఏప్రిల్ 28
తల్లితండ్రులు,పిల్లల తరపున వారి అభిప్రాయాలు మేరకు హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయించిన లోకేష్
మే – 2
విలేకరుల సమావేశం నిర్వహించి పరీక్షలు వాయిదా కాదు రద్దు చెయ్యాలని డిమాండ్
మే -5
పరీక్షలు రద్దు చెయ్యాలంటూ ముఖ్యమంత్రికి మరో లేఖ
మే-13
కరోనా తో తండ్రిని,తాతని కోల్పోయిన ఇంటర్ విద్యార్థి లోకేష్ తో మాట్లాడి అన్నగా అండగా ఉండి చదువు కొనసాగించడానికి సహాయం చేస్తానని హామీ. పదో తరగతి పరీక్షలు రద్దు చేసి తెలంగాణ తరహాలో పాస్ చెయ్యాలని డిమాండ్
మే-25
పరీక్షల రద్దు విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర హోంమంత్రికి లేఖ
మే-29
పరీక్షలు రద్దు చెయ్యాలని ముఖ్యమంత్రిని కోరుతూ పత్రికా ప్రకటన
జూన్ -2
పరీక్షల రద్దు డిమాండ్ తో విద్యార్థులు,తల్లిదండ్రులతో ముఖాముఖీ కార్యక్రమం
జూన్-8
కరోనా కల్లోల సమయంలో పరీక్షల నిర్వహణ – విద్యార్థుల పై పెరుగుతున్న ఒత్తిడి అంశం పై మానసిక వైద్య నిపుణులు, విద్యార్థులతో లోకేష్ ముఖాముఖీ
జూన్ -11
ఇతర రాష్ట్రాల మాదిరిగా పరీక్షలు రద్దు చెయ్యాలని ముఖ్యమంత్రికి లోకేష్ లేఖ
జూన్-16
కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు -విద్యాసంవత్సరం వృధా అనే అంశం పై విద్యార్థులు,విద్యావేత్తలతో లోకేష్ ముఖాముఖీ కార్యక్రమం
జూన్ – 21
మొండి పట్టుదలకు పోయి పరీక్షలు నిర్వహించడం ప్రమాదం అంటూ పత్రికా ప్రకటన
జూన్ -23
పరీక్షలు రద్దు చెయ్యాలి,సుప్రీంకోర్టుకి అఫిడవిట్ సమర్పించాలి అంటూ పత్రికా సమావేశం.
జూన్ -24
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు తక్షణమే మెంటల్ మామ పరీక్షలు రద్దు చెయ్యాలని పత్రికా ప్రకటన