విచిత్రమైన ఉదంతం ఒకటి బిహార్ లో చోటు చేసుకుంది. పరీక్ష రాయటానికి ఎగ్జామ్ హాల్ కు వెళ్లిన ఆ కుర్రాడికి.. హాల్లో పరీక్ష రాసేందుకు ఉన్న అమ్మాయిల సంఖ్యతో టెన్షన్ వచ్చేసిందట. దీంతో.. స్పృహ తప్పిన అతడి తీరు సంచలనంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
బిహార్ లోని నలందాలో ఇంటర్ పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. పరీక్ష రాసేందుకు ఒక విద్యార్థి (మనీశ్)ను అతడి తండ్రి ఎగ్జామ్ హాల్ కు తీసుకొచ్చారు. ఇతగాడు అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. పరీక్ష రాసేందుకు మనీశ్ ను మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం అతడి తండ్రి ఎగ్జామ్ సెంటర్ కు తీసుకొచ్చాడు.
అసలే మ్యాథ్స్ ఎగ్జామ్.. టెన్షన్ లో ఉన్న మనీశ్.. ఎగ్జామ్ హాల్లోకి వెళ్లినంతనే.. తన చుట్టూ అంతా అమ్మాయిలే ఉండటంతో కంగారుపడ్డాడు. తీవ్రమైన టెన్షన్ కు గురైన అతడు.. ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయాడు. దీంతో.. అతడి వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు. చుట్టూ అంత మంది అమ్మాయిలు ఉంటారన్న ఆలోచన లేని మనీశ్.. టెన్షన్ తో స్పృహ కోల్పోయినట్లుగా విద్యార్థి మేనత్త మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ విద్యార్థి ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.