స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం యొక్క కుంభాభిషేకం, ప్రాణప్రతిష్ట సందర్బంగా చర్చిస్తూ సంస్థాపక సభ్యులు, పూర్వాధ్యక్షులు మరియు ప్రస్తుత ఉపాధ్యక్షులు రఘునాథ రెడ్డి ఇలా అన్నారు
స్టాక్టన్ మరియు పరిసర ప్రాంతాల హిందువుల సౌకర్యార్థమై ఒక గుడి నిర్మించాలనే సదుద్ధేశ్యంతో ప్రారంభమైన సంస్థ స్టాక్టన్ హిందూ సాంస్కృతిక మరియు సామాజిక కేంద్రం. తొలుత, భారత దేశము మరియు ఫిజి దేశం నుంచి వలస వచ్చిన 9 మంది సంస్థాపక సభ్యులతో పునాది వేసుకొని వారి విరాళాలతో, జులై 2009లో 2 ఎకరాల భూమి సేకరించి అందులో ఉన్న చిన్న మొబైల్ ఇల్లు ను తాత్కాలిక గుడి గా మార్చి ప్ప్రతి పండగ పబ్బము విధిగా నిర్వహించడము జరిగింది. సనాతన ధర్మ సిద్ధాంతాల ఆధారంగా మొదలైన ఈ సంస్థ, స్థానిక హిందువులకు పూజ స్థలము ఆధ్యాత్మిక కేంద్రము యోగాభ్యాసము తదితర సదుపాయాలు కల్పించాలనే దృష్టి , దృక్పధం తో అంచలంచలుగా పెరుగుతూ 50 మంది కార్యనిర్వాహణ సభ్యులు మరియా 500 ఫై చిలుకు భక్తులు సేవకులతో కలిసి ఒక పెద్ద వసుదైక కుటుంభం ల వెలిసింది .
మే 12,2013 అక్షయ త్రితీయ శుభ ముహూర్తాన భూమి పూజ తో మొదలైన ఆలయ నిర్మాణము పూర్తి అయి వేద పండితులు నిర్ణయంచిన శుభ ముహూర్తానికి కుంభాభిషేకం ప్రాణప్రతిష్ట కు సిద్ధముగానున్నది. భగవత్ అనుగ్రహము మరియు ఎందరో భక్తుల సహాయ సహహకారముల తో వెలసిన ఆలయ భవనము చూడ ముచ్చటగానున్నది. ఈ ఆలయ ప్రాంగణములో శివ బాలాజీ ( వెంకటేశ్వరా స్వామి) నవ గణపతి గర్భ గుడులు ఇంకా దుర్గమ్మ తల్లి షిర్డీడీ సాయి బాబా రామ్ దర్బార్ రాధాకృష్ణుల భూదేవి శ్రీదేవి ఆంజనేయ స్వామి నవ నవగ్రహ ప్రతిష్స్థాపనకు ఆస్కారం కల్పించబడినది . వెంకటేశ్వరా స్వామి పరివారము టీటీడీ వారి సహాయ సౌకర్యముల తో సేకరించబడినది సాయి బాబా ముంబై నించి మిగతావి జైపూర్ రాజస్థాన్ నించి సేకరించబడినవి.
స్టాక్టన్ చరిత్ర లో తల మాణిక కా గల ఈ మహోన్నత కార్యానికి యిదే మా ఆహ్వానం . సకుటుంబ సపరివారము తో విచ్చేసి, కన్నుల విందగు ప్రాణప్రతిష్ట తిలకించి భగవద్ అనుగ్రహం మరియు వేదపండితుల ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసినదిగా మా మనవి. ప్రతిరోజూ టిఫిన్ ఫలహారాలు మధ్యాన్నం మరియు రాత్రి భోజనము ఏర్పాటు చేయబడినది.
స్టాక్ టన్ హిందూ కల్చరల్ అండ్ కమ్యూనిటీ సెంటర్ (ఎస్ హెచ్ సీసీసీ) (SHCCC) వారి ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించబోతున్నాము. స్టాక్ టన్ పరిసర ప్రాంతాల్లోని భక్తుల సౌకర్యార్థం రెండెకరాల సువిశాల స్థలాన్ని SHCCC కలిగి ఉంది. ఆ రెండెకరాలలో ఆలయంతో పాటు యోగా సెంటర్ ఏర్పాటు చేయాలని 2009లో సంకల్పించాం. ఈ క్రమంలోనే 12 వేల చదరపు అడుగుల స్థలంలో ఆలయం నిర్మించాం.
ఈ క్రమంలోనే ఆ ఆలయ ప్రాణ ప్రతిష్ట, సంప్రోక్షణ, కుంభాభిషేకం, ప్రారంభ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించబోతున్నామని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాం. ఈ బృహత్తర కార్యక్రమానికి భక్తులందరూ హాజరై దేవుని ఆశీస్సులు పొందగలరని ఆహ్వానిస్తున్నాం. నాయుడుపేట ఆశ్రమం నుంచి గురు శ్రీశ్రీ వాసుదేవానంద స్వామి(వాసమ్మ) ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. Memphis ఆచార్యులు యాగ బ్రహ్మ శ్రీ సత్యనారాయణతో పాటు మరికొందరు ఆధ్యాత్మిక ప్రముఖులు హాజరు కాబోతున్నారు. చెన్నైకి చెందిన స్తపతి శ్రీ శివ సుబ్రహ్మణ్యమ్ బాలకుమార్, బాలకుమార్ వేదేశ్వరమ్ ఆధ్వర్యంలో నేత్రోన్ మీల్నమ్ జరుగుతుంది.
ఈ ఆహ్వానము మీ బంధుమిత్రులతో పంచుకోగలరని మనవి
వెబ్సైటు www.stocktonhindutemple.org సంప్రదించగలరు లేదా ౨౦౯౬౦౩౪౫౧౨ నెంబర్ కు కాల్ చేయగలరు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమ వివరాలు
బుధవారం (2/16/2022 —సాయంత్రం 4 గంటల నుండి)
భగవత్ అనుగ్న
విశ్వక్సేన పూజ
గణపతి పూజ-పుణ్యహవాచనం
పంచగవ్య ప్రాషన
అఖండ స్థాపన
రక్షాబంధనం
ఆచార్య రిత్విక్ ఇనిషియేషన్
శివాస్త్ర పూజ
భూమి పూజ
మృత సంగ్రాహణ
అంకురార్పణం
మహా నివేదన
ఆశీర్వాదం
తీర్థ ప్రసాదం
మహా సంప్రోక్షణ
గురువారం 2/17/2022 — ఉదయం 8 గంటల నుండి
విశ్వక్సేన పూజ
గణపతి పూజ
పుణ్యహవాచనం
వాస్తు పూజ
వాస్తు హోమం
బాలి పర్య అగ్నీకరణం (నూతన ఉత్సవ మూర్తుల సంప్రోక్షణ ప్రారంభం, పవిత్ర హోమం)
అగ్ని మధనం
అగ్ని ప్రతిష్ఠ
అక్షిన్మోచనం(బింబ నేత్రోన్మీలన్స్)
లక్షనోద్ధరణ
పంచగవ్యాదివసం
చతుర్ధశ కలాష స్నాపనం
అంగ హోమం
మహానివేదన
మహా మంగళ హారతి
నిర్వాహకులకు ఆశీర్వాదం
తీర్థ ప్రసాదం
గురువారం సాయంత్రం 4 గంటల నుండి
విశ్వక్సేన పూజ
గణపతి పూజ
పుణ్యహవాచనం
నిత్య హోమాలు
ఆదివాస హోమాలు
క్షీరాదివసం-విష్ణుపరివార మూర్తులు(పాలు)
జలదివసం-శివరపివార మూర్తులు(నీరు)
కుంభవిహన
మహానివేదన
మహా మంగళ హారతి
మంత్ర పుష్పం
నిర్వాహకులకు ఆశీర్వాదం
తీర్థ ప్రసాదం
శుక్రవారం 2/18/2022 ఉదయం 8 గంటల నుండి
విశ్వక్సేన పూజ
గణపతి పూజ
పుణ్యహవాచనం
కుంభ ఆరాధన
నిత్య హోమాలు
విశేష హోమాలు
క్షీరాదివసం-విష్ణుపరివార మూర్తులు(పాలు)
జలదివసం-శివరపివార మూర్తులు(నీరు)
ఆదివాస హోమాలు
కుంబవిహన
మహానివేదన మహా మంగళ హారతి
మంత్ర పుష్పం
నిర్వాహకులకు ఆశీర్వాదం
తీర్థ ప్రసాదం
శుక్రవారం సాయంత్రం—4 గంటల నుండి
విశ్వక్సేన పూజ
గణపతి పూజ
పుణ్యహవాచనం
కుంభ ఆరాధన
నిత్య హోమాలు
విశేష హోమాలు
ధన్య ఆదివాస
ఫల ఆదివాస
పుష్ప ఆదివాస
పంచ శయ్య ఆదివాస
శివపరివార మూర్తిన్యాసం
తత్వన్యాసం
మహా నివేదన
మహా మంగళ హారతి
విష్ణు పరివార హోత్ర ప్రశంసా హోమాలు
మహానివేదన
మహా మంగహ హారతి
మంత్ర పుష్పం
నిర్వాహకులకు ఆశీర్వాదం
తీర్థ ప్రసాదం
శనివారం 2/19/2022 — ఉదయం 8 గంటల నుండి
విశ్వక్సేన పూజ
గణపతి పూజ
పుణ్యహవాచనం
కుంభ ఆరాధన
నిత్య హోమాలు
శాంతి హోమాలు
బింబ శుద్ధి
మహానివేదన
మహా మంగల హారతి
మంత్ర పుష్పం
నిర్వాహకులకు ఆశీర్వాదం
తీర్థ ప్రసాదం
శనివారం సాయంత్రం – 4 గంటల నుండి
విశ్వక్సేన పూజ
గణపతి పూజ
పుణ్యహవాచనం
కుంభ ఆరాధన
నిత్య హోమాలు
విశేష హోమాలు
ధన్య ఆదివాస
ఫల ఆదివాస
పుష్ప ఆదివాస
పంచ శయ్య ఆదివాస
శివపరివార్ మూర్తిన్యాస
తత్వన్యాసం
మహానివేదన
మహా మంగళ హారతి
విష్ణు పరివార్ హోత్ర ప్రశంసా హోమాలు
మహా నివేదన
మహా మంగళ హారతి
మహా పుష్పం
నిర్వాహకులకు ఆశీర్వాదం
తీర్థ ప్రసాదం
ఆదివారం 2/20/2022 — ఉదయం 8గంటల నుండి
విశ్వక్సేన పూజ
గణపతి పూజ
పుణ్యహవాచనం
వాస్తు హోమాలు
వాస్తు పర్య అగ్నికరణం-విష్ణుపరివార్
మహా శాంతి అభిషేకం
కుంభ ఆరాధన
నిత్య హోమాలు
కళన్యాస హోమాలు
ప్రాయశ్చిత్త హోమాలు
శివ పరివార్-నాడి సంధానం
మహా పూర్ణాహుతి
ప్రధాన కుంభ ఆలయ ప్రవేశం
ప్రాణ ప్రతిష్ఠ(కుంభాభిషేకం)
స్వాములకు అలంకారం
ధేను(గోమాత)దర్శనం
విప్ర దర్శనం
కన్య దర్శనం
సువాసిని దర్శనం
కుంభ దర్శనం
జ్వాలా దర్శనం
దర్పణ దర్శనం
కూష్మాండ బలి(బూడిద గుమ్మడికాయ) దర్శనం
ప్రథమ నివేదన
మహా నివేదన
మహా మంగళ హారతి
మంత్ర పుష్ప
నిర్వాహకులకు ఆశీర్వాదం
తీర్థ ప్రసాదం
ఆచార్యులకు సన్మానం
సర్వేజనా సుఖినోభవంతు
అందరినీ ప్రేమిద్దాం…అందరికీ సేవ చేద్దాం