ఇటీవల అసెంబ్లీలో సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిని చంద్రబాబు స్టిక్కర్ సీఎం అని విమర్శించారు. చంద్రబాబు ఎందుకు అలా అన్నారు. నిజంగానే జగన్ చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన పథకాల పేర్లు మార్చాడా అని పరిశీలించగా వెల్లడైన నిజం ఏంటో తెలుసా.. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జగన్ సుమారు 21 పథకాలకు పేర్లు మార్చి తన స్టిక్కరో, వైఎస్సార్ స్టిక్కరో వేశారు. దీంతో ఏ పథకాలకు జగన్ ఎలా పేరు మార్చి క్రెడిట్ తీసుకున్నారో కింద లిస్టుంది.
👉 చంద్రబాబు కట్టిన పోలీస్ స్టేషన్లు, దిశ పోలీస్ స్టేషన్లుగా మార్పు
👉 చంద్రబాబు తెచ్చిన 4th లయన్ యాప్, దిశా యాప్ గా మార్పు
👉 చంద్రబాబు తెచ్చిన అభయ యాప్, అభయం యాప్ గా మార్పు
👉భూ వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టే ‘భూధార్’ స్థానంలో భూముల ‘స్వచ్చీకరణ’
👉చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్ఆర్ పెళ్లి కానుక అయ్యింది
👉చంద్రన్న భీమా పేరు, వైఎస్ఆర్ భీమాగా మారింది
👉 ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం పేరు, వైఎస్ఆర్ గృహ నిర్మాణ పధకం అయ్యింది
👉 ఎన్టీఆర్ బేబీ కిట్స్, వైఎస్ఆర్ బేబీ కిట్స్ అయ్యాయి
👉 బడి పిలుస్తుంది కాస్తా, రాజన్న బడి బాట అయ్యింది
👉 ఎన్టీఆర్ సుజల పేరు, వైఎస్ఆర్ సుజలగా మారింది
👉విజయవాడ సిటీ స్క్వేర్ పేరు, వైఎస్ఆర్ సిటీ స్క్వేర్ అయ్యింది
👉అన్న అమృతహస్తం, వైస్సార్ అమృతహస్తం అయ్యింది
👉బాల సంజీవిని, వైస్సార్ బాల సంజీవిని అయ్యింది
👉ఎన్టీఆర్ భరోసా పెన్షన్, వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా పేరు మార్పు
👉చంద్రబాబు హయంలో ఉన్న ముఖ్యమంత్రి ఐ కేంద్రాలు, కంటి వెలుగుగా మార్పు
👉గత ప్రభుత్వాలు కట్టిన, ప్రభుత్వ భవనాలకు, తమ పార్టీ రంగులు వేసుకుంటూ, పైశాచిక ఆనందం
👉విజయవాడలో అవతార్ పార్క్ తీసేసి, వైఎస్ఆర్ పార్క్
👉ఎన్టీఆర్ బేబీ కిట్ పైన, వైఎస్ఆర్ బేబీ కిట్ స్టిక్కర్లు
👉చంద్రబాబు కట్టిన వైజాగ్ ఉడా పార్క్, వైఎస్ఆర్ పార్క్ గా పేరు మార్పు
👉ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన అంటూ ప్రచారం
👉అన్నదాత సుఖీభవ పథకం పేరు మార్చి, రైతు భరోసా అంటూ ప్రచారం.