ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ నదిపై ఉన్న శ్రీశైలం రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో భారీగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రం కృష్ణ నది ఒడ్డున మరో పది గ్రామాలు వరదలకు గురయ్యాయి. శ్రీశైలం రిజర్వాయర్ వద్ద నీటి మట్టం దాని గరిష్ట సామర్థ్యం 885 అడుగులు కాగా సోమవారం జలాశయంలో 871.60 అడుగుల నీటి మట్టం ఉంది.
కర్ణాటక లోని తుంగభద్ర జలాశయం వద్ద హెచ్చరికలు జారీ చేయడంతో అక్కడి నుంచి వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్ దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలకు నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శ్రీశైలం రిజర్వాయర్ కు 3.6 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో కొన్ని గేట్లు ఎత్తేశారు. దీంతో పర్యాటకుల తాకిడి మొదలైపోయింది. శ్రీశైలానికి యాత్రికులు పెరుగుతున్నారు. వచ్చే వీకెండ్ లో పూర్తిగా గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో భారీగా జనం రావచ్చని తెలుస్తోంది.
ఒకటి రెండు వారాల్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం కనిపిస్తోంది. ఈ నెలంతా జనం ప్రాజెక్ట్ టూర్లు పెట్టుకునే అవకాశాలున్నాయి. అయితే థర్డ్ వేవ్ భయం పెరుగుతున్న నేపథ్యంలో మరి జనం దానిని లెక్కచేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
దేశమంతటా వరదలు :
భారతదేశం అంతటా 10 రాష్ట్రాలు ప్రస్తుతం వరద వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. అస్సాం, బీహార్, ఉత్తర ప్రదేశ్ తీవ్ర వరదలను ఎదుర్కొంటున్నాయి. తక్కువ వ్యవధిలో అధిక వర్షపాతం కలిపి అధిక వర్షపాతం కారణంగా వరదలు వస్తున్నాయని పార్లమెంటు సోమవారం తెలిపింది. ఈ రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్ఘర్, మధ్యప్రదేశ్, మరియు రాజస్థాన్ ఉన్నాయి. మహారాష్ట్ర కర్ణాటక వరదల వల్ల గోదారిలోకి నీరు పెరిగింది.