శ్రీలంకలో పరిస్థితి రోజురోజుకు పరిస్థితులు దిగజారిపోతున్నాయి. తాజాగా అధికార పార్టీ కూటమి నుండి 50 మంది ఎంపీలు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోవటంతో అధ్యక్షుడు రాజపక్సే ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఒకవైపు నిత్యావసరాల ధరలు ఆకాశానికి ఎగబాకేశాయి. మరోవైపు దేశంలో ఎంత ధరలు పెట్టినా దొరకని నిత్యావసరాలు. ఇదే సమయంలో జనాల్లో పెరిగిపోతున్న ఆందోళనలు, చివరగా 50 మంది ఎంపీల రాజీనామాలతో ప్రభుత్వానికి ఏమి చేయాలో దిక్కుతోచటం లేదు.
నిజం చెప్పాలంటే పరిపాలనపై దేశాధ్యక్షుడు రాజపక్సేకి కంట్రోలు తప్పిపోయింది. అందుకనే దేశం రోజురోజుకు ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆహార, ఆర్థిక సంక్షోభాలకు తోడు రాజకీయ సంక్షోభం కూడా పెరిగిపోతోంది. ఇదంతా అంతిమంగా జనాల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. అందుకనే గురువారం సాయంత్రం జనాలు కొలంబోలోని రాజపక్సే అధికార భవనంలోకి చొచ్చుకుపోయేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దాంతో రాజధానిలో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది.
దేశాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని, ప్రాణాధార మందులు కూడా అయిపోతున్నాయని అధ్యక్షుడు ప్రపంచదేశాలను బతిమలాడుకుంటున్నారు. అంతర్జాతీయ కరెన్సీలో డాలర్ కు శ్రీలంక కరెన్సీ 319 రూపాయలుగా నమోదైంది. శ్రీలంకకు వెళ్ళాలని అనుకుంటున్న తమ దేశ పౌరులను ఆయా దేశాలు హెచ్చరిస్తున్నాయి. శ్రీలంకలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల విషయంలో అమెరికా ట్రావెల్ అడ్వయిజరీని విడుదల చేసింది.
చివరకు ఆందోళనకారుల ఒత్తిడికి తలొంచిన ప్రతిపక్షాలు దేశంలో అధ్యక్ష వ్యవస్థను రద్దు చేయాలంటు పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించబోతున్నాయి. ఒక విధంగా రాజపక్సే తన బాధ్యతల్లో ఘోరంగా విఫలమయ్యారనే చెప్పాలి. దీనికి అనేక అంశాలు కారణమవుతున్నాయి.
ప్రస్తుత సంక్షోభం ఒక్క వారంలోనో లేకపోతే ఒక నెలలోనో వచ్చిందికాదు. కొంతకాలంగా దేశంలో పరిస్ధితులు తల్లకిందులైపోయాయి. ఈ మొత్తానికి రాజపక్సేనే కారణమని చెప్పాలి. ముందూ వెనకా చూసుకోకుండా బుర్రకు తోచిన నిర్ణయాలు తీసుకుని అమలు చేయటంతోనే ప్రస్తుత సంక్షోభానికి కారణమయ్యింది. అందుకే ఆందోళనకారులు రెచ్చిపోయి అధ్యక్ష భవనంలోకి చొచ్చుకుని వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారు. దాంతో అక్కడ ఎప్పుడేమవుతుందో చెప్పలేకపోతున్నారు.
Dr @ashadevos adresses the protesters at the Occupy Independence Square protest.
An absolute pride of the nation!A true daughter of Mother Lanka!
✊????????????❤️
.
.#ashadevos #srilanka #lka #colombo #protest #dissent #srilankacrisis #gohomegota2022 #gotagohome #bananarepublic pic.twitter.com/NEMOqiYbjN— Nuzly ???????? ???? (@nuzlyhameem) April 6, 2022
https://twitter.com/Kavinthans/status/1512103495121326080