భగవంతుని ఉత్సవాలను ఎంత ఘనంగా జరిపిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిత్యం ప్రత్యేక పూజలు, భక్తి, భజన పాటలు.. అబ్బో ఆ సందడే వేరె లెవెల్ లో ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తి పాటలు కన్నా మాస్, డీజే పాటలే ఎక్కువగా వినిపిస్తున్నారు. ముఖ్యంగా దేవుడి ఊరేగింపుల్లో సినిమా పాటలతో యువత డ్యాన్సులు వేస్తూ ఎంత హంగామా చేస్తున్నారో తెలిసిందే. అయితే సాధారణ ప్రజలు డ్యాన్సులు వేయడం సాధారణమైన విషయమే కానీ.. పూజారులు దేవుడి ఊరేగింపులో మాస్ పాటలకు బ్రేక్ డ్యాన్స్ వేయడం చూశారా? ఇటువంటి ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం మందసలోని శ్రీ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఎంతో ఘనంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు రథయాత్ర నిర్వహించారు. అయితే మంగళ వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలు నడుమ శాస్త్రోక్తంగా జరగాల్సిన వాసు దేవుని ఊరేగింపు డీజే పాటలతో బ్రేక్ డాన్స్‌లతో సాగింది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దేవుడి ఊరేగింపులో ఆలయ పూజారులు సైతం బ్రేక్ డ్యాన్స్ వేశారు. డ్యాన్సర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. పూజారులు చేసిన పనికి జనాలు షాకైపోతున్నారు. ప్రతినిత్యం దేవుడి సేవలో ఉంటూ వేద పఠనాలు చదివే పూజాలు వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో బ్రేక్ డ్యాన్స్‌లు వేయడం ఏంటని మండిపడుతున్నారు. దైవ వేడుకలో అర్చకులే ఇటువంటి పనులు చేస్తే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Srikakulam Temple Priests’ Dance Goes Viral!
At the Sri Vasudeva Perumal Temple in Mandaasa, Srikakulam, the 16th annual Brahmotsavam concluded with an unexpected twist!
During the final day’s Rathotsavam, devotional hymns took a backseat as mass songs played instead.… pic.twitter.com/V7iyyGSrpl
— TeluguScribe Now (@TeluguScribeNow) February 25, 2025