* శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు ముచ్చింతల్ ముస్తాబు!*45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో దివ్యక్షేత్రం..!
* ఆరేళ్లలో నిర్మాణం!
* 216 అడుగుల ఎత్తుతో రామానుజుల పంచలోహ విగ్రహం!
* బరువు 1800 కిలోలు.. !
* చైనాలో 1600 భాగాలుగా తయారీ!
* గర్భగుడిలో 120 కిలోల బంగారంతో ‘నిత్యపూజా మూర్తి’ !
* సమతామూర్తి చుట్టూ 108 ఆలయాలు.. !
* మధ్యలో భారీ మండపం!
* ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ దాకా 12 రోజుల పాటు ఉత్సవాలు!
* వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని.. !
* సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో కార్యక్రమం!
* 5న మోదీ రాక.. మహావిగ్రహ ఆవిష్కరణ.. జాతికి అంకితం!
* 13న రాష్ట్రపతి రాక.. నిత్యపూజా మూర్తి విగ్రహానికి తొలిపూజ!
ముచ్చింతలలో 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి శ్రీరామానుజుల విగ్రహం ప్రపంచంలోనే కూర్చున్న స్థితిలో ఉన్న రెండవ ఎత్తైన విగ్రహం.
ఈజిప్టు ఫారోల మాదిరిగానే తమిళనాడులోని ఓ పర్వతంపై శ్రీరామానుజుల శిల్పాన్ని చెక్కాలని మొదట్లో ప్రణాళిక రూపొందించామని, అయితే అలాంటి కొండలు అక్కడ అందుబాటులో లేక ఆ ప్రయత్నం విరమించుకున్నట్టు చెప్పారు.
“2014లో తమిళనాడులో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము, కానీ రెండేళ్ల తర్వాత కూడా పనులు జరగలేదు. చివరికి ముచ్చింతలను ఖరారు చేశాం’’ అని చిన జీయర్ స్వామి తెలిపారు. ప్రతిపాదన ప్రకటించినప్పుడు, మై హోమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు భూమిని విరాళంగా ఇవ్వడంతో ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా అవసరమైన సహాయాన్ని అందించిందని ఆయన చెప్పారు.
ఈ ప్రాజెక్ట్‌లో ప్రతిదీ అంకె 9కి సంబంధించినది. విగ్రహం ఎత్తు 216 అడుగులు, 108 దివ్య క్షేత్ర నమూనా ఆలయాలున్నాయి. దేవత కొలువుదీరిన పద్మపీఠం 27 అడుగులు, శ్రీరామానుజుల చేతిలోని త్రిదండం 27 అడుగులు మొదలైనవి.
“శ్రీ రామానుజులు 100 మైళ్ళు నడిచి, 18 సార్లు తన వద్దకు వచ్చిన తర్వాత తన గురువు నుండి మంత్రం పొందారు” అని చిన జీయర్ స్వామి చెప్పారు. ఇక ఆవిష్కరణ గురించి ఆయన మాట్లాడుతూ 1035 హోమ గుండాలతో 120 యాగశాలలు ఏర్పాటు చేశామన్నారు.
హోమాలు నిర్వహించడానికి సుమారు 1.5 లక్షల కిలోల ఆవు నెయ్యి ఉపయోగించనున్నట్లు చెప్పారు. దీనిని రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి సేకరించారు.
ఇక తాజాగా బయటకు వస్తున్న ఆశ్రమ ఫొటోలు చూస్తుంటే కళ్లు చాలవు. ఎంతో మనోహరంగా ఉన్నాయా చిత్రాలు.