కలియుగ దైవం, ఆపద మొక్కుల వాడు ఆ వెంకటేశ్వరస్వామి సేవ కోసం భక్తి మెండుగా ఉన్న వారిని కమిటీలో నియమిస్తే… స్వామి దైనందిన కార్యక్రమాలకు విరుద్ధంగా ఏం జరిగినా అడ్డుకునే అవకాశం ఉండేది.
సొంత వారికి, మత విశ్వాసాలు కొరవడిన వారికి… శ్రీవారి సన్నిధిలో ఇతర మత దేవతల పేర్లు తలచే వారికి పదవులు ఇవ్వడంతో భక్తుల మనసులు గాయపరిచే చర్యలు ఏపీలో జరుగుతున్నాయి.
హిందు భక్తులను సెంటిమెంటుతో బంధీ చేయడానికి వైకాపా నాయకులు కొత్త కుట్రపన్నారు. నిబంధనలు ఉల్లంఘించి, స్వామి వారి ప్రసాదాన్ని ఓట్ల కోసం పంచుతున్నారు. పరమపవిత్ర మైన ఆ కలిగయు దేవుడి ప్రసాదాన్ని పంచడంతో పాటు శ్రీవారి పాదుకలు, దైవ ప్రతిమలు పంచుతున్నారు.
సెంటిమెంటుతో వారు ఇతరులకు ఓటేయకుండా కట్టిపడేసే ప్రయత్నం ఇది. దేవుడితో రాజకీయాలు చేస్తున్న వీరి తీరుపై నారా లోకేష్ వరుస ట్వీట్లతో మండిపడ్డారు. ఆయన ఏమన్నారో చూద్దాం.
చంద్రగిరి నియోజకవర్గం తొండవాడ పంచాయతీలో వైసీపీ నేతలు పరమపవిత్రమైన శ్రీవారి లడ్డూలను ఓట్ల స్లిప్పులతో కలిసి పంచుతూ స్వామివారికి మహాపచారం తలపెట్టారు. @ysjaganకి,వైసీపీనేతలకు ఎన్నికలపైనే కానీ, ఏడుకొండలవాడిపై భక్తిలేదు.(1/5)
సన్నాసుల సన్నబియ్యం వ్యాన్లలో లడ్డూలను తరలించి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు. ఎస్సీలకు 5 లడ్లు, ఇతరులకు 10 లెక్క పంపిణీ చేసి కులవివక్ష చూపారు. ఓట్లకు కోట్లు వెదజల్లుతున్నా పల్లెల్లో జగన్‌రెడ్డిని జనం నమ్మడంలేదు.(2/5)
శ్రీవారి లడ్డూలిస్తే భక్తితోనైనా ఓటేస్తారని వైకాపా నేతలు పన్నిన కుతంత్రం ఇది. హిందువులకు అత్యంత పవిత్రమైన లడ్డూలను ఓటర్లకు తాయిలాలుగా పంచిన అభ్యర్థిని పోటీకి అనర్హులుగా ప్రకటించాలి.(3/5)
కొండపై భక్తులకు ఒక లడ్డూ దొరకని పరిస్థితిలో ఇన్ని వేల లడ్డూలు తరలించిన వైసీపీ నేతలు, వారికి అందించిన టిటిడి యంత్రాంగంపై చర్యలు చేపట్టాలి.(4/5)
స్వామికి జరిగిన అపచారం, వ్యాన్లలో తరలింపు, ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, కులవివక్షలపై కేసులు నమోదు చేసి నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.(5/5)