పల్నాడు ప్రజలు కసితో ఓటేశారని.. అందుకే 86 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని నరసరావు పేట ఎంపీ .. టీడీపీ అభ్యర్థి.. లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. అయితే, దీనిని చూసి ఓర్వలేకే వైసీపీ నాయకు లు, ఓ మీడియా తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. పల్నాడులో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసలో తన పాత్ర ఉంటే విచారించుకోవచ్చని సవాల్ రువ్వారు. అంతేకాదు.. తన ఫోన్ నెం బరు ద్వారా జరిగిన లావాదేవీలుకూడా.. పరిశీలించుకోవచ్చన్నారు. పల్నాడు అల్లర్లపై సిట్ పూర్తిస్థాయి లో విచారణ జరిపించాలని అన్నారు.
పల్నాడు ఎస్పీగా ఉండి.. ఇటీవల సస్పెండ్ అయిన గరికపాటి బిందు మాధవ్‌తో తనకు ఎలాంటి బంధుత్వం లేదని ఎంపీ లావు చెప్పారు. తనపై లేనిపోనివి ప్రచారం చేసి.. ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టాల ని.. తనను ఒక కులానికి, ఒక మతానికి పరిమితం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. తనకు, పోలిసు పోస్టింగులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పల్నాడు హింసలో టీడీపీ ని ప్రోత్సహించానన్న వ్యాఖ్యలు కూడా సరికాదని అన్నారు.
పోలింగ్ అనంతర పరిణామాల్లో తాను కూడా బాధితుడినేనని ఎంపీ లావు తెలిపారు. దొండపాడు గ్రామం లో తన కాన్వాయ్ అద్దాలు కూడా పగుల గొట్టారని.. అయినా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదని చెప్పారు. ఎంపీగా ఉండి తామే గొడవలను ప్రోత్సహించామని వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. పోలింగ్ రోజు.. తర్వాత.. తనతో ఉన్న ప్రతిఒక్కరి వివరాలను సిట్ అధికారులకు ఇచ్చేందుకు తాను సిద్ధంగానే ఉన్నానన్నారు.