కొమురం భీం టీజర్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముందు ఆదివాసీలలో టీజరుపై వ్యతిరేకత వ్యక్తం కాగా తాజాగా రాజకీయ స్పందనలు మొదలయ్యాయి. రాజమౌళి తీస్తున్న RRR కొమురం భీం, అల్లూరి సీతారామరాజు కథల ఆధారంగా అల్లిన స్టోరీ.
అల్లూరి టీజరు విషయంలో ఏ వివాదాలు రాలేదు. కానీ కొమురం భీం వివాదాలకు కారణమైంది.కొమురం భీం …. తెలంగాణ నిజాం దొరలపై పోరాడిన యోధుడు. అలాంటిది నైజాం (ముస్లిం) రాజుల మత సంప్రదాయమైన టకియాను కొమురం భీం పాత్రధారికి పెట్టడం అంటే అది కొమురం భీంను అవమానించినట్టే అని ఆదివాసీలు అంటున్నారు.
దీనిపై తాజాగా బీజేపీ ఎంపీ సోయం బాబూ రావు తీవ్ర హెచ్చరిక చేశారు. టకియా (ముస్లిం టోపీ) కనుక కొమురం భీం ధరించినట్టు చూపెడితే థియేటర్లను తగలబెడతాం అన్నారు. అలాంటి పనిచేయొద్దని రాజమౌళిని హెచ్చరించారు. సినిమాలో ఆ సీన్ కనిపించొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికలను లెక్కచేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అన్నారు. తెలియకపోతే రాజమౌళి చరిత్ర తెలుసుకోవాలని సూచించారు.