చేతికి ఎముకే లేని విధంగా జనాలకు డబ్బులు ఖర్చుపెట్టి అడగకనే ప్రజాసేవ చేస్తున్న సోనుసూద్ … అక్రమానికి పాల్పడ్డాడు అంటూ ముంబై కార్పొరేషన్ నోటీసులు ఇచ్చారు. సోను సూద్ తన భవనాన్ని హోటల్ గా మార్చి డబ్బులు సంపాదిస్తున్నాడన్నది బీఎంసీ పెట్టిన కేసు.
దీనిపై సోనూసూద్ కు బొంబాయి హైకోర్టు కు వెళ్లారు. అయితే… మీరు బీఎంసేకే వెళ్లి దీనిని పరిష్కరించుకోండి అంటూ కోర్టు చెప్పింది. ఈ సందర్భంగా జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘‘మీరు చాలా ఆలస్యమయ్యారు, ఇప్పుడు బంతి మున్సిపల్ కార్పొరేషన్ చేతుల్లోకి వెళ్లిపోయిందని… అక్కడే మీ సమస్యను పరిష్కరించుకోండి’’ అని జడ్జి వ్యాఖ్యానించారు.
ముంబైలోని జుహు ప్రాంతంలో సోనూసూద్ కు ఆరంతస్తుల భవనం ఉంది. 5 నెలల క్రితం, అక్టోబర్ 2020లో ఆయనకు బీఎంసీ నోటీసులు పంపించింది. నివాస సముదాయాన్ని హోటల్ గా మార్చి చట్ట విరుద్ధ పద్ధతిలో కమర్షియల్ లాభాలను పొందారన్నది బీఎంసీ వాదన.
అయితే… ఇక్కడ బీఎంసీ అయినా, గవర్నమెంటు అయినా రాజకీయ నాయకులు నడిపించేదే. అవినీతి చేయని నేతలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇలాంటి వారు కోట్ల రూపాయల తన ఆస్తిని ఏమీ ఆశించకుండా అభాగ్యుల కోసం ఖర్చుపెట్టిన సోనుసూద్ చేసింది అక్రమ అనడంతో సోషల్ మీడియాలో బీఎంసీపై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి.