Actress #SoniaAgarwal is a big #Thalapathy fan n says he is a Sweet heart ????@actorvijay#Beast pic.twitter.com/pnRh811ey7
— Iʀsʜᴀᴅ (@irshad5005) July 18, 2021
కొందరి హీరోయిన్ల ఫేస్ ఫిజిక్ మిగతా వారికి భిన్నంగా ఉంటుంది… అంటే చూడగానే రొమాంటిక్ గా ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు సోనియా అగర్వాల్.
ఈమె అతి చిన్న వయసులో పెళ్లి చేసుకుని కెరీర్ పాడు చేసుకున్న హీరోయిన్లలో ఒకరు. 2002లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అపుడు ఆమెకు 20 ఏళ్లు.
మరో రెండేళ్ల తర్వాత అంటే 22 ఏళ్ల వయసులో సోనియా 7G బృందావన్ కాలనీ సినిమాలో నటించింది. అది బంపర్ హిట్. ఆ సినిమా దర్శకుడు అయినా సెల్వరాఘవన్ తో ఆమె ప్రేమలో పడింది. 2006లో వీరిద్దరు పెళ్లాడారు. ఒక హీరోయిన్ 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం అంటే అది కెరీర్ కి అడ్డే. కానీ ఆమె తొందరపడింది. తర్వాత తప్పు తెలుసుకుని 2010లో విడాకులు తీసుకుంది.
విడాకుల తర్వాత తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సోనియా జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ మూవీలో మంచి ఛాన్స్ కొట్టింది. ఇక అప్పటి నుంచి సినిమాల్లో క్యారెక్టర్ అర్టిస్టుగా, సహ నటిగా చేస్తూ పలు టీవీ షోలు చేస్తూ వస్తోంది.
ఇపుడు ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఈసారి కూడా ఆమె ఇంకో దర్శకుడినే ప్రేమిస్తుండటం గమనార్హం.