• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జూ.ఎన్టీఆర్ పై సోము హాట్ కామెంట్స్

admin by admin
September 7, 2022
in Andhra, Politics, Top Stories, Trending
1
0
SHARES
156
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో క్రిస్టియానిటీ పెరిగిపోయిందని, హిందూ దేవాలయాలు, హిందూ ధర్మంపై దాడులు ఎక్కువయ్యాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ హయాంలోని టీటీడీ పాలక మండలి ప్రతిష్ట మరింత మసకబారిందని, తిరుమలలో అన్యమత ప్రచారం జోరుగా సాగుతోందని తీవ్ర ఆరోపణలు వస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. తిరుమలలో అన్యమత ప్రచారంపై నిషేధం ఉందని, కానీ, అక్కడ క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

గతంలో అలిపిరి దగ్గర ఆర్ఎస్ఎస్, బీజేపీ స్టిక్కర్ ఉన్న ఓ భక్తుడి వాహనాన్ని తిరుమల కొండపైకి వెళ్లకుండా పోలీసులు నిలిపివేయడం వివాదాస్పదమైంది. తిరుమలకు వెళ్లే వాహనాలపై హిందూ సంస్థల స్టిక్కర్లు ఉన్నా వాటిని పోలీసులు నిలిపివేయడం చర్చనీయాంశమైంది. తాము వేరే మతాన్ని ప్రచారం చేయడం లేదని, ఫక్తు హిందూ సంస్థనే తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవడంలో ఆంతర్యమేంటని ఆ భక్తుడు ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సోము…తిరుమలలో కొందరు అన్యమత ప్రచార ప్రస్తావన, అన్యమత ప్రార్థనల వ్యవహారం తన దృష్టికి తీసుకువచ్చారని షాకింగ్ కామెంట్లు చేశారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో వనరులున్న ఏపీ సరైన దిశలో నడవాల్సిన అవసరం ఉందన్నారు.

జూ.ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువ అని, ఆయన సేవలు ఉపయోగించుకుంటామని సోము అన్నారు. టీడీపీపై తమ వైఖరిలో ఎలాంటి మార్పులేదని అన్నారు. కుటుంబ రాజకీయాలకు, ఫ్యామిలీ పార్టీలకు దూరమని బీజేపీ అధిష్ఠానం చెప్పిందని వ్యాఖ్యానించారు. జగన్ ను టార్గెట్ చేస్తూనే సోము వీర్రాజు అన్యమత ప్రచారంపై వ్యాఖ్యలు చేశారని టాక్ వస్తోంది. తిరుమలలో అన్యమత ప్రార్థనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని భక్తులు వాపోతున్నారు. గతంలో కూడా బీజేపీ నేతలు ఈ ఆరోపణలు చేయడంతో టీటీడీ అధికారులు స్పందించారు. తిరుమలలో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని, అలా జరిగితే ఉపేక్షించబోమని టీటీడీ గతంలో ప్రకటించింది.

Tags: amit shahamit shah met jr.ntrap bjp chief somu veerrajujr.ntrjr.ntr to support bjp?somu's comments on jr.ntr
Previous Post

అమరావతి నిజంగా భ్రమరావతేనా?

Next Post

రాహుల్ గాంధీ యాత్రలో హైలైట్ ఇదే

Related Posts

Trending

అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్

February 8, 2023
kotam reddy sridhar reddy
Trending

బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్

February 8, 2023
Trending

స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్

February 8, 2023
Top Stories

లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్

February 8, 2023
Trending

సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌

February 8, 2023
lokesh rally
Politics

మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌

February 8, 2023
Load More
Next Post

రాహుల్ గాంధీ యాత్రలో హైలైట్ ఇదే

Comments 1

  1. Pingback: జూ.ఎన్టీఆర్ పై సోము హాట్ కామెంట్స్ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • అమరావతే రాజధాని..కేంద్ర మంత్రి స్వీట్ న్యూస్
  • బోరుగడ్డ ఆఫీసు దగ్ధంపై కోటంరెడ్డి రియాక్షన్
  • స్మితతో చిరంజీవి నిజం చెప్పారా? ప్రోమో వైరల్
  • లిక్కర్ స్కామ్‌లో కవిత మాజీ సీఏ బుచ్చిబాబు అరెస్ట్
  • సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న జ‌గ‌న్ పాట‌
  • మోసానికి ఫ్యాంటు చొక్కా తొడిగితే.. జ‌గ‌న్‌
  • `వై నాట్‌`తో ఉతికేసిన నారా లోకేష్‌.. ఏమ‌న్నారంటే!
  • త్వ‌ర‌లోనే కాంగ్రెస్ స‌ర్కార్‌:  రేవంత్‌
  • రగులుతున్న కృష్ణా.. టీడీపీ నేత‌ల అరెస్టులు.. రీజ‌నేంటి?
  • హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్
  • జగన్ కు కొత్త పేరు పెట్టిన పవన్
  • బాబు, పవన్ ల పొత్తుపై అమర్ నాథ్ అక్కసు
  • రూ.300 కోట్లకు పేర్ని నాని స్కెచ్
  • బాబూ మోహన్ బూతు పురాణం..వైరల్
  • బాలకృష్ణ కు వ్య‌తిరేకంగా కుట్ర‌?

Most Read

కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

ఒక్క ప్రశ్నతో వైసీపీ వాళ్లకు దిమ్మతిరిగింది… అందరూ సైలెంట్

హైకోర్టుకు పయ్యావుల…జగన్ కు షాక్

టాలీవుడ్లో భారీ సెక్స్ రాకెట్

ఎంత పని చేశావ్ … ఒక్క వీడియోతో జగన్ కి జ్వరం తెప్పించావే

బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra