ఇడ్లీ తింటూ మీడియాతో మాట్లాడటం
పొట్ట గుండీలు పగిలిపోయేలా హోటల్ సోఫాలో నిద్రపోతూ మీడియా కంటపడటం
ఇలా విచిత్రంగా వీర్రాజు వైరల్ అవుతుంటారు.
అవగాహన రాహిత్యానికి పోతపోసిన నేతలా ఉండే వీర్రాజు తాజాగా వైసీపీ మీద విమర్శలు చేయబోయి తన అజ్జానాన్ని అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకున్నారు.
ఏమైందంటే… ఏపీలో జగన్ సర్కారు స్వచ్ఛ ఆంధ్ర కింద వాహనాలు కొని వాటికి చెత్త రంగులు వేసింది.
పాపం చెత్త రంగులు వైసీపీ రంగులు ఒకటే అయితే వైసీపీ వాళ్లు మాత్రం ఏం చేస్తారు.
కానీ అవి పార్టీ రంగులు కాదు, చెత్తకు వేసే రంగులు అవే అని ఎరుక లేకుండా వీర్రాజు ఆ ఫొటోలు పెట్టి వైసీపీపై విమర్శలు చేశారు.
గతంలో ఎన్నో సార్లు గౌరవ రాష్ట్ర హైకోర్టు చేత ఇదే రంగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చీవాట్లు పెట్టించుకుంది. అయినా కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ క్రింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వేల కోట్ల రూపాయల నిధులతో కొన్న వాహనాలకు తిరిగి (2/4) pic.twitter.com/OpcGAoL8VA
— Somu Veerraju / సోము వీర్రాజు (Modi ka Parivar) (@somuveerraju) October 1, 2021
తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు! 5 వ శతాబ్ధానికి చెందిన ప్రముఖ సంస్కృత రచయిత భర్తృహరి గారు వ్రాసిన ఈ సుభాషితం, ప్రస్తుత @ysjagan గారి ప్రభుత్వానికి చాలా బాగా నప్పుతుంది.
గతంలో ఎన్నో సార్లు గౌరవ రాష్ట్ర హైకోర్టు చేత ఇదే రంగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చీవాట్లు పెట్టించుకుంది. అయినా కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ క్రింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వేల కోట్ల రూపాయల నిధులతో కొన్న వాహనాలకు తిరిగి YSRCParty రంగులు వేసుకున్నారంటే హైకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా ఉల్లంఘించినట్లే. కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా చెత్తకుప్పలో వేసేసి, చెత్త తీసుకెళ్ళే వాహనాలను కూడా వదలకుండా ఇలా వైసీపీ రంగులు వేసుకోవడాన్ని @BJP4Andhra చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
వెంటనే ఇలాంటి పనులకు ముగింపు పలకకపోతే ప్రజలతో, మిత్రపక్షం JanaSenaParty తో కలిసి YSRCParty ప్రభుత్వంపై భారీ ఎత్తున పోరాటం తప్పదని @BJP4Andhra తీవ్రంగా హెచ్చరిస్తోంది.
ఇది వీర్రాజు పెట్టిన ట్వీట్..
పాపం వీర్రాజును సోషల్ మీడియాలో ఒకాట ఆడుకుంటున్నారు. నిజంగా వైసీపీ తప్పు చేసినపుడు సైలెంట్ గా ఉండి… ఇపుడు మాట్లాడటం వల్ల జగన్ కి మేలు చేసి తన రుణం తీర్చుకునేలా వీర్రాజు మాట్లాడుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎందుకంటే అది తడి చెత్త, పొడి చెత్తకి కలర్ నిబంధన … అనే విషయం అవగాహన ఉంటే వీర్రాజు ఇలా మాట్లాడేవాడా? లేకపోతే జగన్ కు మేలు చేయాలన్న తాపత్రయమో అర్థం కాని పరిస్థితి.