టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, హీరో నాగ చైతన్య జంట కొద్ది నెలల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ్లతో చైతూ డేటింగ్ చేస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ పుకార్లకు ఊతమిచ్చే విధంగానే శోభిత, చైతూల జంట ఎన్నోసార్లు కెమెరాలకు చిక్కింది. తాజాగా లండన్ లోని ఓ రెస్టారెంట్లో ఈ కపుల్ కనిపించడంతో ఆ పుకార్లు నిజమేనని టాక్ వస్తోంది.
వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని టాలీవుడ్ లో ఊహగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటివరకు చైతూ పెదవి విప్ప లేదు. కానీ, తాజాగా ఈ పుకార్లపై శోభిత ధూళిపాళ్ల స్పందించింది. తెలివి తక్కువ రాతలకు తాను స్పందించాల్సిన అవసరం లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. అటువంటి వాటికి క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదని చెప్పింది. ఎవరో ఏదో రాస్తే తాను ఎందుకు వివరణనివ్వాలని ప్రశ్నించింది.
తనకు స్పందించాల్సిన అవసరం ఏంటని క్లాస్ పీకింది. ఇటువంటి రాతలు రాయడం కంటే జీవితంలో పైకి ఎలా ఎదగాలి అనే అంశంపై దృష్టి పెట్టాలని, కామ్ గా మంచిగా ఉండాలని హితవు పలికింది. అయితే, ఇంత చెప్పిన శోభిత తనకు చైతూకు మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని చెప్పలేదు. తాము లండన్ లో ఎందుకు కలిశాము అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఈ పుకార్లు ప్రస్తుతానికి పుకార్లు గానే మిగిలిపోనున్నాయి.