ఈ ఆగస్టు ఎండింగ్ లో సందడి చేయబోతున్న చిత్రాల్లో `సరిపోదా శనివారం` ఒకటి. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తే.. ప్రతినాయకుడు పాత్రను దర్శకనటుడు ఎస్. జె. సూర్య పోషించారు. 2024 ఆగస్టు 29న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సరిపోదా శనివారం మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే గత రెండు వారాల నుంచి చిత్ర బృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దసరా, హాయ్ నాన్న విజయాల తర్వాత ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్రిక్ హిట్ కొట్టాలని నాని ఆశపడుతున్నారు. ఇదిలా ఉంటే.. సరిపోదా శనివారం మూవీకి గానూ ఎస్. జె. సూర్య అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా హీరో,హీరోయిన్లతో పోలిస్తే విలన్ల రెమ్యునరేషన్ తక్కువగానే ఉంటుంది. కానీ సూర్య మాత్రం సరిపోదా శనివారం మూవీకి హీరో రేంజ్ రెమ్యునరేషన్ ఛార్జ్ చేశారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. రూ. 8 నుంచి 10 కోట్ల మధ్య ఆయన పారితోషికం అందుకున్నారని అంటున్నారు. అయితే అంత భారీ మొత్తంలో సూర్య రెమ్యునరేషన్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు.
సరిపోదా శనివారంలో హీరో నానికి ఎంతటి ప్రధాన్యత ఉంటుందో.. అంతే ప్రధాన్యత విలన్ గా నటించిన ఎస్.జె. సూర్యకు కూడా ఉంటుంది. అటు నాని హీరోయిజం, ఇటు సూర్య విలనిజం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయట. ఇటీవల బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.