ఆయన రాజకీయ నాయకుడు కాదు. నెలకు లక్షా 70 వేల రూపాయల వేతనం తీసుకున్న కీలక అధికారి. ఎంత చేయాలని ఉన్నా.. ఎంత చేసినా.. అవినీతి సొమ్ము ఎంత పోగేసినా.. ఓ 50 ఎకరాలు, ఓ 10 కోట్లు మాత్రమే కూడబెట్టగలరు. కానీ, ఇలా చేస్తే.. ఆయన గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చెప్పుకొనే పరిస్థితి వచ్చేది కాదు. ఆయన అలా చేయలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 214 ఎకరాల భూమిని సొంతం చేసుకున్నారు. 7 అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొల్లగొట్టారు. 9 ఖాళీ స్థలాలు దక్కించుకున్నారు. ఇవి కూడా ఆయా ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల వెంబడివి కావడం గమనార్హం. అంతేకాదు.. కోట్లకు కోట్ల నగదును రాబట్టారు. ఈ డబ్బును ఇంకా లెక్కిస్తూనే ఉన్నామని.. అధికారులు తెలిపారు.
ఇంతకీ ఆయన ఎవరో కాదు.. హెచ్ ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణవి!!. ఆశ్చర్యంగా అనిపించినా.. నిజమే. ఎందుకంటే.. ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో వీటి కంటే ఎక్కువగానే ఆస్తులను పొందుపరిచారు. ఇక, ఇవి చూసి న్యాయమూర్తి సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే శివ బాలకృష్ణకు 14 రోజుల రిమాండ్ పొడగిస్తూ తీర్పునిచ్చారు. దాంతో శివ బాలకృష్ణను చంచల్ గూడ జైలుకు తరలించారు
ఇవీ.. శివ బాలకృష్ణ ఆస్తులు
+ మొత్తం గుర్తించిన ఆస్తులు ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 250 కోట్లు
+ ఇవి బహిరంగ మార్కెట్లో 20 వేల కోట్ల రూపాయలు ఉంటాయని లెక్క.
+ 214 ఎకరాల భూమి
+ 29 ప్లాట్లను గుర్తించారు.
+ తెలంగాణతో పాటు వైజాగ్ లోనూ ప్లాట్స్
+ మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు
+ 7 అపార్ట్మెంట్ ప్లాట్స్
+ 3 విల్లాలు
+ డబ్బులు ఇంకా లెక్కిస్తున్నారు.
https://twitter.com/KethireddyTarun/status/1755230758401376456