ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నవి మూడే జనరల్ సీట్లు ఖమ్మం, పాలేరు, కొత్తగూడెం. ఈ మూడు సెగ్మెంట్లలోనూ ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా ఉంది. ఈసారి పాలేరులో అధికార బీర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఒక్కడు ఒకవైపు ఉంటే.. అటుపక్కన ఇతర పార్టీల నేతలు కీలక నేతలు అందరూ గుంపులు గుంపులుగా మరోవైపుగా ఉన్నట్టు ఉంది. బిఆర్ఎస్ అభ్యర్థిగా కందాళ ఉపేందర్ రెడ్డి రెండు నెలల నుంచి గ్రామ గ్రామాన ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తుందా ? లేదా కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే సిపిఎం పోటీ చేస్తుందా? ఒకవేళ కాంగ్రెస్ పోటీ చేసినా తుమ్మల నాగేశ్వరరావు పోటీలో ఉంటాడా పొంగులేటి పోటీ చేస్తాడా అన్నది వాళ్లకే క్లారిటీ లేదు. ఎట్టకేలకు ఈ సీటు కాంగ్రెస్ తీసుకుని పొంగులేటి పోటీలో ఉన్నాడు. పొంగులేటి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నందునే ప్రచారంలో ఉన్నారే తప్పా ఆయన ఈ నియోజకవర్గ బాగోగులు, ప్రజల క్షేమ సమాచారం ఏనాడైనా పట్టించుకున్న దాఖలాలే లేవు.
ఇటు ప్రచారంలో కందాళ సింగిల్‌గా దూసుకుపోతున్నారు. ఇప్పటికే పాలేరులో సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ కూడా సక్సెస్ అయ్యింది. అటు కాంగ్రెస్ పొంగులేటికి సపోర్ట్‌గా ఇప్పటికే వైఎస్సార్ తెలంగాణ అధ్యక్షురాలు అస్త్ర సన్యాసం కూడా చేశారు. శీనన్నకే తానే సపోర్ట్ అని చెప్పకనే చెప్పేశారు. ఇక సీపీఐ – కాంగ్రెస్ పొత్తు కూడా ఫిక్స్ అయ్యింది. ఆ పార్టీ వాళ్లు కూడా పొంగులేటి వెంట తిరుగుతున్నారు. ఇక సీపీఎంతో కూడా చివరి క్షణంలో పొత్తు కుదిరే ఛాన్సులే ఉన్నాయి.
అదే జరిగితే ఇక్కడ సీపీఎం నుంచి పోటీ చేస్తానని చెపుతోన్న తమ్మినేని వీరభద్రం కూడా పొంగులేటికి సపోర్ట్‌గా ఎన్నికల ప్రచారం చేయాల్సిందే. విచిత్రం ఏంటంటే పేరుకు మాత్రమే పోటీలో ఉన్న బీజేపీ, బీఎస్పీల్లో చాలా మంది పొంగులేటికే సపోర్ట్ అంటోన్న పరిస్థితి. అంటే కాంగ్రెస్ పొంగులేటికి సీపీఎం, వైఎస్సార్టీపీ, సీపీఐ, బీజేపీ, బీఎస్పీ ఇలా ఈ పార్టీలకు చెందిన వారంతా గుంపులు గుంపులుగా కలిసి సపోర్ట్ చేస్తోన్న వాతావరణమే పాలేరులో స్పష్టంగా కనిపిస్తోంది.