తెలుగు సినీ సాంగ్స్ సింగర్ నాగూర్ బాబు ఉరఫ్ `మనో` గురించి తెలుసుకదా! రజనీకాంత్‌కు తెలుగులో డబ్బింగ్ చెప్పడమే కాకుండా.. తెలుగు సినీ గీతాల్లోనూ ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు 35 ఏళ్లుగా మనో సినీ రంగంలో కొనసాగుతున్నారు. దివంగత బాల సుబ్రహ్మణ్యంతో సాటి అనిపించుకున్న గాయకుడు కూడా. అయితే.. ఆయన ఎప్పుడూ వివాదాల జోలికి పోలేదు. చాలా సౌమ్యంగా, అందరివాడిగా ముందుకు సాగారు. తెలుగులోనూ.. తమిళంలోనే కాకుండా కన్నడ ఇండస్ట్రీలోనూ మంచిపేరు తెచ్చుకున్నారు.
అయితే.. ఫస్ట్ టైమ్ మనో పేరు వివాదాల రూపంలో తెరమీదికి వచ్చింది. ఆయన పుత్రరత్నాలు చేసిన పనితో తమిళనాడులోనే కాకుండా ఏపీ, తెలంగాణలోనూ.. వివాదాస్పదమయ్యారు. తమిళనాడులో అయి తే.. బ్రేకింగ్ న్యూస్‌లు ఇరగదీస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. మనోకు ఇద్దరు కుమారులు రఫిక్, సాహీర్ఉ న్నారు. వీరిద్దరూ.. మంగళవారం రాత్రి సమయంలో చెన్నై ఆలప్పాక్కానికి చెందిన కృపాకరన్, మదురవాయల్‌కు చెందిన వళసరవాక్కం(16)లపై నానా బూతులు తిడుతూ.. చితక్కొట్టారు.
ఆ సమయంలో మనో కుమారులు ఇద్దరూ ఫుల్లు లోడ్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు. కృపాకరన్, వళసరవాక్కంలు.. శ్రీదేవికుప్పంలోని ఫుట్‌బాల్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వెళ్తున్నారు. ఈ సమయంలో సమీపంలోని ఓ హోటల్‌కు వెళ్లగా.. అక్కడే మనో కుమారులు.. తమ మిత్రులతో కలిసి వీరిపై దాడికి దిగారని పోలీసులు తెలిపారు. దాడి చేసిన సమయంలో మనో కుమారులు ఇద్దరూ పూటుగా మద్యం తాగి ఉన్నారని కేసులో పేర్కొన్నారు.
వీరి దాడిలో కృపాకరన్ తీవ్రంగా గాయపడగా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు. దీంతో మనో కుమారులు రఫిక్, సాహీర్, వారి స్నేహితులు ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నా రు. ఇదిలావుంటే.. ఈ విషయం తెలిసిన వెంటనే.. మనో పుత్రరత్నాలు పరారయ్యారని, వారికోసం గాలి స్తున్నామని పోలీసులు చెప్పారు. ఇక, ఈ దాడికి సంబంధించిన వ్యవహారం స్థానిక వాట్సాప్‌లలో జోరుగా వైరల్ అయింది.