మనదేశంలో కొందరు నాయకులు వేలాది కోట్లు దోపిడీ చేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యాపారాలు విస్తరించారనేవిమర్శలు .. కేసులు కూడా ఉన్నాయి. ఏపీ సీఎం జగన్పై 42 వేల కోట్ల మేరకు.. దోపిడీ చేశారని సీబీఐ నేరుగా చెబుతోంది.ఇక, ప్రతిపక్షాలు మాత్రం మరింత లోతుగా విచారిస్తే.. ఇది లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే..ఇక్కడ చర్యలు నాలుగు అడుగులు ముందుకు.. పది అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉంటున్నాయి.
అయితే..ఇప్పుడు పాకిస్థాన్ మాజీ ప్రధాని దిగ్గజ క్రికటర్, తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీఅధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ను అత్యంత హీనంగా అరెస్టు చేసిన దరిమిలా.. భారత్లో అవినీతి పరులైన నాయకులపై ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇక్కడ ఎవరినైనా అలా అరెస్టు చేసే అవకాశం ఉందా? అంటూ.. జాతీయ మీడియాసైతంగగ్గోలు పెట్టింది.ఈ నేపథ్యంలో అసలు ఇమ్రాన్ చేసిన అవినీతి ఎంత? ఇదే పరిస్థితి భారత్లో వస్తే.. అరెస్టయ్యేవారు ఎందరు? అనే చర్చ తెరమీదికి వచ్చింది.
ముందుగా పాక్లో ఏం జరిగిందో చూద్దాం.. దేశ ఖజానాకు నష్టం కలిగించినందుకు ఇమ్రాన్ ఖాన్ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అరెస్టు చేసింది. పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం ఇమ్రాన్ 7 బిలియన్ల పాకిస్థానీ రూపాయల(అంటే.. 70 కోట్లు) కుంభకోణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. మరి 70 కోట్లకే ఇంతగా ఆయనను మెడపై చేయి వేసి..బలవంతంగా అరెస్టు చేస్తే.. భారత్లో వేలాది కోట్లు దోచుకున్న వారి పరిస్థితి ఏంటి? అనేది ఇప్పుడు చర్చ.
భారత్లో తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో ఏపీ సీఎం జగన్ 42 వేల కోట్లతో ముందు వరుసలో ఉన్నారు. తర్వాత స్థానంలో యూపీ మాజీ సీఎం మాయావతి 20 కోట్ల రూపాయల దోపిడీ చేశారనే అభియోగాలు పెండింగులోనే ఉన్నాయి. ఇక, ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. బిహార్ మాజీ సీఎం ప్రస్తుతం జైలు-ఇల్లు అని తిరుగుతున్న లాలూ చేసిన అవినీతి కేవలం 60 లక్షల రూపాయలు.. అయినా.. వీటిలో ఎవరినీ జైలులో పెట్టే సాహసం కానీ.. అరెస్టులు కానీ.. పెద్దగా చేయకపోవడం గమనార్హం. ఇంకా మరికొందరి పేర్లు.. అసలు తెరమీదికి రాని వారివి కూడా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వెలుగు చూసిందని చెబుతున్నది కేవలం 20 కోట్లేనని మీడియా చెబుతోంది.