ప్రాంతీయ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణతో, దక్షిణ భారత చిత్రాల దండయాత్ర బాలీవుడ్ ను తొక్కేసింది. రోబో బాహుబలి సినిమాలతో మొదలైన ఈ పరంపర .. కేజీఎఫ్, RRR, పుష్ప, కేజీఎఫ్ 2 తదితర సినిమాలో ఓ రేంజ్ కి వెళ్లిపోయింది.
బాలీవుడ్ వాళ్లు తమ సినిమాను ఇండియన్ సినిమా అని పిలుచుకుంటారు. మనం పాన్ ఇండియన్ సినిమా అని మాట్లాడుకుంటూ మన సినిమాలను మనం అవమానపరుచుకుంటున్నామని ప్రముఖ నటుడు సిద్ధార్థ వేదన చెందారు.
పాన్ ఇండియా అనే పదం వాడారు అంటే అది ప్రాంతీయ చిత్రం అని మనమే చెప్పినట్లు అవుతుందంటున్నారు సిద్ధార్థ్.
చాలా మంది పాన్ ఇండియా అనగానే అభినందన అని అనుకుంటున్నారు… కానీ అది అగౌరవకరం అని నటుడు సిద్ధార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాన్-ఇండియన్… నాన్సెన్స్! సినిమాలన్నీ భారతీయ చిత్రాలే.”
“15 ఏళ్ల క్రితం పాన్-ఇండియన్ సినిమా లేదని చెప్పాలా? ఇండియన్ సినిమా అంటే ఇండియన్ సినిమా. మా బాస్ మణిరత్నం ‘రోజా’ అనే సినిమా తీశాడు, ఇది భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చూసింది. ఇది పాన్ ఇండియా అని ఎవరూ అనలేదు. – భారతీయ సినిమా ” అని సిద్ధార్థ్ వ్యాఖ్యానించారు.
“ఈరోజు బెంగళూరులోని నా స్నేహితులు ‘కేజీఎఫ్’ తీశారు. వారి గురించి నేను చాలా గర్వపడుతున్నాను. ‘కేజీఎఫ్’ భారతీయ సినిమా. ఇది కన్నడ చిత్రం. మీరు దీన్ని మీకు నచ్చిన భాషలో చూడవచ్చు, కానీ ఇది భారతీయ చిత్రం. కన్నడ పరిశ్రమ రూపొందించింది. మీరు నన్ను అడిగితే పాన్-ఇండియా అనే పదాన్ని తీసివేయాలి. దీనిని కేవలం భారతీయ చిత్రం అని పిలవాలి. లేకుంటే, దానిని రూపొందించిన భాషలో చూడండి.” అన్నారు.
తెలుగు, కన్నడ చిత్రాల్లో పనిచేసిన టెక్నీషియన్లు హిందీ చిత్రసీమలో కూడా పనిచేస్తున్నారని నటుడు సిద్ధార్థ్ ముగించారు. కాబట్టి, కంటెంట్ బాగుంటే, మీరు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రతిచోటకు వెళ్తుంది అన్నారు.