తెలుగు ప్రజల్లో భారీ ఎత్తున చర్చ జరగటమే కాదు.. తీవ్ర ఉద్రిక్తతకు కారణమైన ‘మా’ ఎన్నికల గురించి తెలిసిందే. ఈ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ వేళ.. నటి హేమ హాట్ టాపిక్ గా మారారు.
నటుడు శివాజీ రాజా చేతిని కొరికిన వైనం ఆమెను వార్తల్లో ప్రముఖంగా మారటమేకాదు.. ఆమె కొరుకుతున్న ఫోటోలు బయటకు రావటం కలకలం రేగింది. అయితే.. శివబాలాజీ తనను అడ్డుకున్నందుకే ఆమె అలా చేసినట్లు వివరణ ఇచ్చినా.. హేమ తీరు మాత్రం చర్చగా మారింది.
ఇదిలా ఉంటే దసరాకు ముందు రోజు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవటానికి విజయవాడ వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న వేళ.. తనకు ఎదురైన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు.
ప్రతి దసరాకు తాను బెజవాడ దుర్గమ్మను దర్శించుకుంటానని.. అందులో భాగంగానే ఈసారి తాను దర్శనం చేసుకున్నట్లు చెప్పారు.
ప్రతి ఏడాది అమ్మవారికి తాను చీరను ఇస్తానని.. ఈసారి మాత్రం తనకు చీర ఇవ్వాలని అమ్మవారిని కోరానని చెప్పారు. విచిత్రంగా తానుఅమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత దేవదాయా శాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్ అనుకోకుండా తనకుచీరను బహుకరించారన్నారు.
అమ్మవారిని కోరుకున్నంతనే జరిగిన ఉదంతం తనకెంతో ఆనందాన్ని ఇచ్చినట్లు చెప్పారు. ‘మా’ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడిన ఆమె తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఎన్నికల్లో ఏం జరిగిందో కనకదుర్గమ్మకే తెలియాలన్నారు. రాత్రి గెలిచిన తాను ఉదయానికి ఓడిపోయానని చెప్పారు.