వైసీపీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికలతో జీవితం తిరగబడింది. ఆ తర్వాత అన్నీ సెల్ఫ్ గోల్సే. అసెంబ్లీలో చేసిన ఎస్సీ, ఎస్టీ తీర్మానంపై నేతలకు సెగ ప్రారంభమైంది. బోయ, వాల్మీకి వర్గాలను, వడ్డెరలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చేలా.. ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసింది. దీనిని సీఎం జగన్ గొప్ప సంస్కరణగా పేర్కొన్నారు. కావొచ్చు.. కానీ, ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇస్తున్న రిజర్వేషన్‌కు ఇది గండి కొట్టే పరిస్థితిని తీసుకువస్తుందని వైసీపీ ఎమ్మెల్యేల్లోనే తర్జన భర్జన సాగుతోంది.
అయితే.. ప్రభుత్వం మాత్రం వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయిం చింది. అయితే..తీర్మానం ఇలా చేశారో.. లేదో.. అలా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వస్తున్నాయి. అన్ని పార్టీల నేతలు కూడా దీనిని ఖండించారు. అలాగని ఆయా వర్గాలకు మేలు చేయొద్దని చెప్పడం లేదు. కానీ, ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లను పెంచడం వల్ల.. ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతుందనేది ప్రధాన విమర్శ.
ఈ క్రమంలో జిల్లాల్లోని వైసీపీ నేతలు కూడా ఇదే విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. అసెంబ్లీ ముగించుకునిజిల్లాల్లోకిఅడుగు పెట్టిన నాయకులకు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేతల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పటి వరకు లేంది.. కొత్తగా ఎందుకుచేస్తున్నారని.. వారు ప్రశ్నించారు. అంతేకాదు.. తమకు అన్యాయం చేస్తారా? అని కూడా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎస్సీలు మంత్రి వద్దకు వచ్చిన నిరసన తెలపడం సంచలనంగా మారింది.
దీంతో వచ్చే ఎన్నికల్లో ఏదో మేలు జరుగుతుందని అనుకున్న వైసీపీకి ఆదిలోనే హంసపాదుమాదిరిగా ఎస్సీ , ఎస్టీ వర్గాల నుంచి వ్యతిరేకత రావడం గమనార్హం. అయితే.. వాస్తవానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపినప్పటికీ.. ఇది ఆమోదం పొందడం కష్టమే. అయినప్పటికీ.. ప్రజల్లో మాత్రం దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరి దీనిని ఎలా కట్టడి చేస్తారో చూడాలి. ఏదేమైనాఎన్నికలకు ముందు తీసుకున్న ఈ నిర్ణయంపై సొంత పార్టీలోనే నేతలకు సెగపుడుతుండడం గమనార్హం.