నిబంధనలకు విరుద్ధంగా బూతు సినిమాలు తీసి అడ్డంగా బుక్ అయిన రాజ్ కుంద్రా అరెస్టు కావటం..ఈ మధ్యనే బెయిల్ రావటం తెలిసిందే. భర్త అరెస్టుతో షాక్ కు గురైన రాజ్ కుంద్రా సతీమణి..సీనియర్ నటి శిల్పాశెట్టి కొన్ని రోజులు బయటకు రాకుండా ఉండటం తెలిసిందే.
మొదట్లో తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని నమ్మకంతో ఉన్న ఆమె.. తర్వాతి కాలంలో బయటకు వచ్చిన విషయాలతో ఆమె కోపంతో ఉన్నట్లు చెబుతారు. సంపాదన కోసం ఎలా పడితే అలా చేయటమా? అంటూ ఆవేదనతో ఉన్న ఆమె.. విచారణలో భాగంగా ఇంటికితీసుకొచ్చిన సందర్భంలో భర్త మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
భర్త లీలల గురించి బయటకు వచ్చిన వివరాలతో ఆమె తీవ్రమైన మానసిక వేదననుఅనుభవించిందని చెబుతున్నారు. చేతిలో ఉన్న కాంట్రాక్టులు పోవటం.. తనకున్న ఇమేజ్ కు భారీగా డ్యామేజీ జరిగిన నేపథ్యంలో.. కొంతకాలంగా ఒంటరిగా ఉన్న ఆమె.. తన వైవాహిక జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. రాజ్ తో తెగతెంపులు చేసుకోవటానికి ఆమె సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్యనే షూటింగ్ లకు హాజరవుతున్న ఆమె.. ముభావంగా ఉన్నట్లు చెబుతున్నారు.
భర్తకు విడాకులు ఇచ్చేసి.. పిల్లల్ని తనతో పాటు ఉంచుకోవాలని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికి భర్త చేసిన పనితో తీవ్రమైన అవమాన భారాన్ని ఎదుర్కొంటున్న ఆమె.. ఈ మధ్యనే ‘నేను తప్పు చేశా’ అంటూ పోస్టు పెట్టటం.. దానికి కొనసాగింపుగా.. ‘తప్పులు మానవ సహజం. తప్పులు చేయకుండా ఎవరూ ఉండరు.కానీ.. ఆ తప్పులు భయంకరంగా.. ఇంతరుల్ని బాధ కలిగించేలా ఉండకూదు. తప్పు చేశానుకానీ వాటిని సరిదిద్దుకుంటాను’ అని పేర్కొన్న పోస్టుతో ఆమె తన మనోగతాన్ని వెల్లడించినట్లుగా చెబుతుున్నారు.
అంతేకాదు.. భర్త సంపాదనను తాను ముట్టుకోకూడదన్న పట్టుదలతో శిల్పా ఉన్నట్లు చెబుతారు. గతంలోనూ తన భర్త తప్పులు చేస్తే ఓర్పుగా క్షమించిన ఆమె.. .ఇకపై ఆ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టాలని.. ఈసారి మాత్రం అతని నుంచి విడిపోవటానికి మానసికంగా సిద్ధమైనట్లు చెబుతున్నారు. త్వరలోనే తన విడాకులు విషయాన్ని వెల్లడించే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఇందులో నిజం ఎంతన్న విషయాన్ని శిల్పా ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి.