శిల్పా చౌదరి.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు. ప్రముఖులను టార్గెట్ చేసి కిట్టీ పార్టీల పేరుతో వారి నుంచి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె బాధితుల చిట్టా చాలా పెద్దదే అని తెలుస్తోంది.
సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులు ఆమె వలలో పడ్డట్లు తెలుస్తోంది. బాధితులు ఒక్కొక్కరిగా బయటికి వచ్చి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. ఒక హీరో కుటుంబ సభ్యులు శిల్పా చౌదరి పుణ్యమా అని ఏకంగా రూ.12 కోట్లు పోగొట్టుకున్నట్లుగా వార్తలొస్
ఆ హీరో కుటుంబంలోని ఇద్దరు తలో రూ.6 కోట్ల చొప్పున ఫిలిం ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల కోసమని శిల్పా చౌదరికి ముట్టజెప్పారట. ఆమెను నమ్మి మరో సీనియర్ నటుడు రూ.2.4 కోట్లు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.
అంతే కాక ఒక పోలీస్ ఉన్నతాధికారి కోడలు రూ.6 కోట్లుె, కీలక స్థానంలో ఉన్న ఒక న్యాయమూర్తి కుటుంబ సభ్యులు రూ.5 కోట్ల చొప్పున వ్యాపారంలో పెట్టుబడి కోసం శిల్పా చౌదరికి ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ప్రముఖులను ముందుగా మచ్చిక చేసుకుని వారికి విల్లాల్లో లగ్జరీ పార్టీలు ఇవ్వడం ద్వారా వారి దృష్టిని శిల్పా ఆకర్షించేదట.
ఈ పార్టీల్లో లక్షల రూపాయల విలువైన మద్యం సరఫరా చేసేవారట. ఈ పార్టీల్లోనే బిజినెస్ డీల్స్ జరిగేవని.. వారిని నమ్మించి కోట్ల రూపాయల పెట్టుబడికి శిల్పా చౌదరి ఒప్పించేదని తెలుస్తోంది. శిల్పా భర్త కృష్ణ శ్కరీనివాస ప్రసాద్ అలెక్సా అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రీజనల్ డైరెక్టర్గా పని చేస్తూ.. భార్య చేసిన మోసాలకు సహకరించేవాడని.. సేకరించిన డబ్బులతో రియల్ ఎస్టేట్ కంపెనీ మొదలుపెట్టి భూములు కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శిల్పా చౌదరి చంచల్ గూడ జైల్లో.. ఆమె భర్త చర్లపల్లి జైల్లో ఉన్నారు.