వైసీపీ అధినేత జగన్ను ఆయన సోదరి.. వైఎస్సార్ టీపీ నాయకురాలు.. షర్మిల అడ్డంగా ఇరికించేశారా? ఇప్పటి వరకు.. ఒకవిధమైన చర్చలో ఉన్న అత్యంత కీలక విషయంలో షర్మిల కుండబద్దలు కొట్టినట్టు వ్యవహరించి.. వైసీపీ కీలక నేతలను అంతర్మథనంలో పడేశారనే చర్చ జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం జగన్ పై నమోదైన సీబీఐ కేసుల విచారణ వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో ఆయన బెయిల్ ఎప్పుడైనా రద్దయ్యే అవకాశం ఉందని.. ఇదే జరిగితే.. జైలుకు వెళ్లడం ఖాయమని.. ఒక చర్చ సాగుతోంది. ఎందుకం టే.. సుప్రీం కోర్టు రాజకీయ నేతలపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేయాలని కోరుతోంది.
ఈ క్రమంలో సీబీఐని తప్పుకూడా పడుతోంది. 15 ఏళ్ల కేసులకు సంబంధించి కూడా ఇప్పటి వరకు చార్జి షీట్లు దాఖలు చేయకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. సో.. దీంతో సీబీఐ ఉరుకులు పరుగులు పెడు తోంది. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దయితే.. ఆయన జైలుకువెళ్లాల్సి ఉంటుందని.. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే చర్చ సాగుతోంది.
అయితే.. దీనిపై వైసీపీ సీనియర్లు ఎవరూ.. కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. అంతేకాదు.. ఒకరిద్దరు స్పందించినా.. అసలు అవన్నీ తప్పుడు కేసులని.. రాజకీయ కక్షతో పెట్టిన కేసులని.. చెప్పుకొస్తున్నారు.
కానీ, తాజాగా ఓ మీడియా అధిపతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ సోదరి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధి నేత్రి షర్మిల కుండబద్దలు కొట్టినట్టు సమాధానం ఇచ్చారు.
“రేపు ఏదైనా.. జరగరానిది జరిగితే.. ఏపీలో ముఖ్యమంత్రి మార్పు అనేది.. ఆ పార్టీ పెద్దలే నిర్ణయించుకుంటారు. ఆ పార్టీకి నాకు సంబంధం లేదు. నేను కనీసం ఆ పార్టీలో సభ్యురాలిని కూడా కాదు“ అని చెప్పేశారు షర్మిల.
దీనిని విశ్లేషించిన వైసీపీ ఎంపీ రఘురామ రాజు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇప్పటి వరకు జగన్ ఎందుకు జైలుకు వెళ్లాల్సి వస్తుందని.. తనతోపాటు అందరూ అనుకున్నారని.. కాంగ్రెస్ ఉద్దేశ పూర్వకంగా రాజకీయ కక్షతో ఈ కేసులు పెట్టిందని అనుకున్నామన్నారు.
అయితే.. అంతర్గతంగా ఏం జరిగిందో తెలుసు కాబట్టే.. షర్మిల తన సొంత అన్న `కాన్ఫిడెంట్`గా ఉన్నారేమోనని రఘురామ వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమనే సంకేతాలు.. షర్మిల ఇస్తున్నారా? ఇలా అయితే.. కష్టమే..! అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
నిజానికి షర్మిల.. ఇలాంటి ప్రశ్న వచ్చినప్పుడు.. “జైలు లేదు.. ఏమీ లేదు.. అసలు ఎందుకు వెళ్లాలని… అన్నయ్య మీద ఉన్నవన్నీ.. కుట్ర కేసులే“ అని ఉండాలని.. కానీ ఇలా వ్యాఖ్యానించడం.. అనుమానాలకు తావిస్తోందని రఘురామ వ్యాఖ్యానించడం గమనార్హం.