బాపట్ల నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల ఏపీ సీఎం, తన సోదరుడు జగన్ పై విరుచుకుపడ్డారు. ఆమె ఒక్కో డైలాగుతో జగన్ కు భారీ కౌంటర్లు వేశారు. జగన్ ఇటీవల ఎన్నికల కోసం ‘సిద్ధం’ అంటూ సభలు నిర్వహిస్తుండడంతో ఆ సిద్ధంను టార్గెట్ చేస్తూ ఆమె దేనికి సిద్ధం జగనన్నా మళ్లీ రూ. 8 లక్షల కోట్లు అప్పు చేయడానికా సిద్ధం అంటున్నావు అంటూ ఆమె వెటకారమాడారు.
అంతే కాదు తన అన్న ఎన్నడూ ప్రజల్లోకి రాడని.. పెద్దపెద్ద కోటలు కట్టుకుని అందులో ఉంటున్నాడని ఆమె అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి సిద్ధం అంటూ జనాలను మోసం చేస్తున్నాడని… మళ్లీ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతున్నావా… 8 లక్సల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమవుతున్నావా.. 25 లక్షల ఇళ్లు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధం అంటున్నావా అంటూ ఆమె జగన్ మాట ఇచ్చి తప్పిన అంశాలు, ప్రజలను మోసం చేసిన విషయాలను హైలైట్ చేస్తూ ఆడుకున్నారు.
అంతేకాదు… మీరు దీనికి సిద్ధమైతే మిమ్మల్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ఆమె మాటల తూటాలు కురిపించారు.
రాష్ట్రంలో రోడ్లు కూడా సరిగా లేవని.. ప్రగతి ఎక్కడా లేదని.. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్ ఉన్నాడని ఆమె ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇసుక మాఫియా మీద ప్రేమ తప్ప ప్రజల గురించి ఆలోచన లేదన్నారు.
‘రైతుకు పరిహారం లేదు..కనీసం బీమా కూడా లేదు.. అంతా మోసమే .అన్ని వర్గాలకు మోసమే.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా లేదు.. జాబ్ క్యాలెండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు.. గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేయాలని అసమర్థ ప్రభుత్వం.. 5 ఏళ్లలో పూర్తిగా మద్య నిషేదం చేస్తా అని జగన్ ఆన్న హామీ ఇచ్చారు.. 5 ఏళ్ల తర్వాత మద్య నిషేధం చేసి ఓట్లు అడుగుతా అన్నాడు.. మ్యానిఫెస్టో నాకు బైబిల్ తో సమానం అన్నాడు’ కానీ అందులో ఒక్క పని కూడా చేయలేదు అంటూ ఆమె తన అన్న జగన్ పై విరుచుకుపడ్డారు.