బిగ్ బాస్ సీజన్ 5 పూర్తై వారం దాటింది. వందకు పైగా రోజులు హౌస్ లో ఉన్న వేళ.. సిరితో క్లోజ్ గా ఉండటం.. విపరీతమైన హగ్గులతో టైటిల్ విన్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకున్న యూట్యూబర్ షణ్ను జస్వంత్ తాజాగా సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు.
సిరితో అదే పనిగా ఇచ్చిన హగ్గులతో విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకున్న అతడు.. ఇప్పుడు హైదరాబాద్ కు దూరంగా ఉన్నారు.
బిస్ బాస్ హౌస్ లోకి రాక ముందే.. షణ్నూ.. దీప్తి సునయినతో రిలేషన్ లో ఉండటం.. మరోవైపు సిరికి శ్రీహాన్ తో ఎంగేజ్ మెంట్ కావటం తెలిసిందే. అలా ఇద్దరు వేర్వేరు వారితో కమిట్ మెంట్ ఉన్న వేళ.. అందుకు భిన్నంగా విపరీతమైన హగ్గులతో జనాలకు మొహం మొత్తేలా చేశారు. దీంతో.. సిరి.. షణ్నులు విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యారు.
ఇదిలా ఉంటే.. షణ్నుకు.. దీప్తికి మధ్య బ్రేకప్ అయ్యిందని.. వారిద్దరు విడిపోయినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. తాజాగా లైవ్ లోకి వచ్చిన షణ్నూ పలు అంశాల మీద స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం దీప్తి తనను ఇన్ స్టాలో బ్లాక్ చేసిందని.. త్వరలోనే హైదరాబాద్ కు వెళ్లి ఆమెను కలుస్తానని చెప్పాడు.
తన వల్ల దీపు చాలా నెగిటివిటిని ఫేస్ చేసిందని.. అయినప్పటికి తన కోసం నిలబడిందన్నారు. తప్పకుండా వెళ్లి మాట్లాడతానని.. తనతో బ్రేకప్ అయితే జరగదన్నాడు.
నా చేతి మీద పచ్చబొట్టు పోయేంత వరకు దీపును వదలనని చెప్పాడు. మరోవైపు సిరితో తన స్నేహం కంటిన్యూ అవుతుందని చెప్పాడు. సిరి.. జెస్సీ తన బెస్ట్ ఫ్రెండ్స్ గా పేర్కొన్నారు. బిగ్ బాస్ హౌస్ లో వందకు పైగా రోజులు ఉండి.. ఎప్పుడెప్పుడు బయటకు వస్తాను.. దీపును కలుస్తానని చెప్పిన షణ్ను.. హౌస్ నుంచి బయటకొచ్చి వారంత అవుతున్నా.. ఆమెను కలవలేదంటే.. సమ్ థింగ్.. సమ్ థింగ్ తేడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.