ఇతర రంగాల్ని కాసేపు పక్కన పెడితే.. సినిమా రంగంలో casting couch క్యాస్టింగ్ కౌచ్ మీద భారీ చర్చనే నడిచింది.
అప్పుడప్పుడు ఎవరో ఒక నటి తనకు ఎదురైన చేదు అనుభవాలను ఇంటర్వ్యూలలో ప్రస్తావించటం ద్వారా మీడియాలో ఫోకస్ అవుతుంటారు.
అయితే.. ఈ మాటల్ని చెప్పేందుకు దమ్ము.. ధైర్యం చాలా ముఖ్యం.
చాలామంది నటీమణులు తమకు ఎదురైన అనుభవాల్ని బయటకు వెల్లడించే ప్రయత్నం చేయరు.
తాజాగా అలాంటి ధైర్యాన్నే ప్రదర్శించారు బాలీవుడ్ నటి shama sikander షామా సికిందర్.
తనకు ఎదురైన చేదు అనుభవాల్ని వెల్లడించేందుకు అస్సలు వెనుకాడలేదు.
పలు టీవీ సీరియల్స్ తోపాటు.. bollywood సినిమాల్లోనూ యాక్ట్ చేసిన ఈ beauty తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాల్ని వెల్లడించారు.
అయితే.. గతానికి వర్తమానానికి తేడా ఉందని.. అప్పట్లో డైరెక్టర్లు అవకాశాలు కావాలంటే చనువుగా ఉండాలని.. బెడ్ షేర్ చేసుకోవాలని చెప్పేవారని.. ఇప్పుడు యువ దర్శకులు మాత్రం అలా లేదరన్నారు.
ఇప్పటి యువ దర్శకులు చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారని.. నటీనటులకు చాలా గౌరవ మర్యాదలు ఇస్తున్నట్లు చెప్పారు.
ఒకప్పుడు దర్శక నిర్మాతలు హీరోయిన్లు తమతో గడపాలంటూ ఇబ్బంది పెట్టేవారని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
అప్పట్లో పేరున్న దర్శక నిర్మాతలు కొందరు తమతో పని చేయకున్నా.. నటీమణులు తమతో సన్నిహితంగా ఉండాలని కోరుకునే వారన్నారు.
వారితో పని చేయకున్నా.. సన్నిహితంగా ఉండాలన్న వారి మాటలు తనకు ఆశ్చర్యంగా అనిపించేవని.. ‘మీతో కలిసి పని చేయనప్పుడు మీతో స్నేహంగా ఎలా ఉంటాం? అని అడిగేదాన్ని’ అని పేర్కొన్నారు.
దానికి వారు స్పందిస్తూ.. ‘నీకు పని కావాలంటే మాతో చనువుగా ఉండాలి. మాతో బెడ్ షేర్ చేసుకోవాలి’ అని చెప్పేవారన్నారు.
అప్పట్లో హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలా అభద్రతా భావంతో ఉండేవారని.. అలా చేస్తేనే ఛాన్సులు ఉండేవన్నారు.
కానీ.. ఇప్పుడు అలా కాదని.. చాలా మార్పులు వచ్చాయన్నారు.
ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ లేదని తాను చెప్పటం లేదని.. కానీ.. గతంతో పోలిస్తే మాత్ర ంచాలా మార్పులు వచ్చాయన్నారు.
ఏమైనా.. ఆమె మాటలు మారిన ఇండస్ట్రీ తీరును చెబుతుందని చెప్పాలి.