పేరుకు పేరు.. మంచి ఆదాయం సరిపోలేదు ఆ యువనటికి. అంతకు మించిన అత్యాశతో చేసిన ఆమె పని ఇప్పుడు పరువు పోయేలా చేయటమే కాదు.. మరీ ఇలాంటి దరిద్రపుగొట్టు పనులు చేయటమా? అన్నది భోజ్ పురి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ సెక్సు రాకెట్ గుట్టు రట్టు కావటమే. ఈ రాకెట్ లో పోలీసులు ఒక భోజ్ పురి యువనటి 24 ఏళ్ల సుమన్ కుమారిని అరెస్టు చేయటం సంచలనంగా మారింది.
తూర్పు ముంబయిలోని ఆరే కాలనీలో ఉన్న ఒక ఫేమస్ హోటల్లో వ్యభిచారం జరుగుతుందన్న విషయం పోలీసులకు సమాచారం అందింది. అదేమీ తక్కువ హోటల్ కాకపోవటంతో.. వెంటనే తనిఖీలు చేపట్టని పోలీసులు తొలుత నిఘా పెట్టారు. తమకు అందిన సమాచారం పక్కా అని నిర్దారించుకున్నతర్వాత పక్కా ప్లాన్ తో అక్కడ జరుగుతున్న హైటెక్ వ్యభిచారాన్ని బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు మోడళ్లను రెస్క్యూ చేశారు. ఒకరిని అరెస్టు చేయగా.. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో యువనటి సుమన్ కుమారికి సంబంధం ఉందని గుర్తించిన పోలీసులు.. ప్లాన్ ప్రకారం ఆమెను అరెస్టు చేశారు. లైలా మజ్ను సినిమాతోపాటు జామ్ స్టిక్ బాక్స్.. భోజ్ పురి కామెడీ ఎపిసోడ్ బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రిలో నటించింది. ఇవే కాకుండా.. హిందీ.. పంజాబీ మ్యూజిక్ అల్బమ్ లోనూ పని చేసినట్లుగా చెబుతున్నారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ తాజాగా చేసిన ట్వీట్ లో కన్ఫర్మ్ చేసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం వర్థమాన మోడల్స్ కు అవకాశాలు ఇస్తామని చెబుతూ.. ఈ తప్పుడు పనులు చేయిస్తుందన్న విషయాన్ని గుర్తించారు. ఈ వర్ధమాన నటి వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఉదంతం భోజ్ పురి ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.