ఇప్పటివరకు ఉన్న అభిప్రాయాల్ని కొట్టిపారేసేలా.. నమ్మకాలు నీరుకారే అధ్యయన ఫలితం ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఎక్కువగా సెక్సులో పాల్గొంటే మంచిది కాదని.. దానితో గుండె సమస్యలకు తెర తీసినట్లు అవుతుందంటూ చెప్పే మాటల్లో అస్సలు నిజం లేదని తేల్చింది తాజా పరిశోధన.
యూరోపియన్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ కార్డియాలజీ ప్రచురించిన ఒక రీసెర్చ్ ప్రకారం సరససల్లాపాల ద్వారా గుండెపోటుతో బాధపడే వ్యక్తులు త్వరగా కోలుకునే అవకాశం ఉందంటున్నారు. తమ జీవితాల్ని హ్యాపీగా లీడ్ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని అల్లాటప్పాగా చెప్పటం లేదు. దాదాపు 20 సంవత్సరాలకు పైనే 495 జంటల మీద జరిపిన అధ్యయనంతో ఈ విషయాల్ని వెల్లడించారు.
గుండెపోటుకు గురైన తర్వాత అసలు సె-క్సు చేయని వారితో పోలిస్తే.. సాధారణంగా లైంగిక జీవితాన్ని కొనసాగించే వారు మరణించే అవకాశాల్ని 35 శాతం మేర తగ్గించుకున్నట్లుగా తేల్చారు. ఇజ్రాయెల్ కు చెందిన ప్రొఫెసర్ యారిన్ టెలీ అవీవ్ వర్సిటీలో పని చేస్తుంటారు. తాజాగా ఆయన ఇదే అంశం మీద మాట్లాడుతూ.. గుండెపోటుతో బాధ పడుతున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తమ లైంగిక కార్యక్రమాల్ని తిరిగి ప్రారంభించొచ్చని.. ఎలాంటి సమస్యా ఉండదన్నారు.
సెక్స్ లాంటి ఆకస్మిక శారీరక శ్రమ గుండెపోటును ప్రభావితం చేస్తుందన్న ఆందోళనలు చాలామందిలో ఉన్నాయి.. కానీ తాజా పరిశోధన తేల్చిన విషయం ఏమంటే.. రెగ్యులర్ గా సె-క్సులో పాల్గొనటం ద్వారా ఆ సమస్య నుంచి త్వరగా బయటపడే వీలుంది తేల్చారు. ఆరోగ్యకరమైన సె-క్స్ గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని పేర్కొన్నారు. సో.. అనవసరమైన భయాల్ని వదిలేసి.. క్రమపద్దతిలో క్షేమకరమైన సరససల్లాపాలు పెంచండి.. నిత్యం ఎంజాయ్ చేయండి.