భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు.. ఆరు రోజుల పాటు అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరు రోజుల పర్యటన అనంతరం.. వారికి శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో భారత సంతతి వ్యక్తులు.. ఎన్నారైలు.. భారత దౌత్య కార్యాలయ జనరల్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్.. ఆయన బృందం.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఘన వీడ్కోలు పలికారు.
శాన్ఫ్రాన్సిస్కో నుంచి లండన్ చేరుకునే సీజేఐ దంపతులు.. రెండు రోజులు అక్కడే ఉంటారు. అక్కడ జరిగే సదస్సులో పాల్గొని భారత్కు తిరుగు పయనమవుతారు.
ఆతిథ్యం అదరహో!!
అమెరికా పర్యటనలో జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు కాలిఫోర్నియాలో ఇండో అమెరికన్ అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(40 భారతీయ సంఘాల కూటమి) ఆయన కోసం ప్రత్యేక ఆహ్వాన కార్యక్రమా న్ని ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ అధ్యక్షుడు జయరాం కోమటి, ఇతర కార్యవర్గ బృందాలతో పాటు భారీ సంఖ్యలో తెలుగువారు, ఎన్నారైలు పాల్గొన్నారు.
కార్యక్రమానికి భారీగా తరలి వచ్చిన ఇండో-అమెరికన్లకు ఉద్దేశించి `ఇవాళ మినీ ఇండియా`లో ఉన్నట్లుగా ఉందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. గత రెండు దశాబ్దాల్లో ఇండియాలో ఎన్నో మార్పులు జరిగాయని తెలిపారు.
సాంకేతిక ప్రపంచంలో అధునాతన ఆవిష్కరణలదే అగ్రస్థానమని తెలిపారు. ఆలోచనల్లో మార్పు రాకపోతే ముందడుగు వేయలేమని చెప్పిన సీజేఐ.. ఎప్పటిక ప్పుడు కొత్త ఆలోచనలు వస్తేనే మార్పు సాధ్యమవుతుందన్నారు.
శాన్ఫ్రాన్సిస్కోలో..
శాన్ ఫ్రాన్సిస్కోలో భారతీయ అమెరికన్ల సంఘం జస్టిస్ రమణ దంపతులను ఘనంగా సన్మానించింది. రాజ్యాంగంలో నిర్దేశించిన చెక్స్ అండ్ బ్యాలెన్సె్సను అమలు చేయడానికి దేశంలో రాజ్యాంగ సంస్కృతిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయనీ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
శాన్ఫ్రాన్సిస్కోలోని భారత రాయబారి అధికారిక నివాసంలో జరిగిన కార్యక్రమంలో కాలిఫోర్ని యా గవర్నర్ మిస్ ఎలెనీ కౌనాల్కిస్ ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జస్టిన్ ఎన్వీ రమణ దంపతులు గవర్నర్కు భారత జాతిపిత మహాత్మాగాంధీ జీవిత చరిత్ర పుస్తకాన్ని బహూకరించారు.