జగన్ హయాంలో ఏపీలో అమ్ముతున్న మద్యం బ్రాండ్లు…వాటితో జనానికి పడుతున్న బ్యాండ్లు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా ఏపీలో జగన్ తన సొంత బ్రాండ్లు పెట్టి చీప్ గా లిక్కర్ అమ్ముతున్నారని విమర్శలు వస్తున్నాయి. మద్యం రేట్లు ఆకాశాన్నంటుతున్నా…బ్రాండ్లు మాత్రం నాసిరకం ఉండడంపై దుమారం రేగుతోంది. మద్యపాన నిషేధం అంటూ జగన్…తన సొంత కంపెనీల మద్యాన్ని అమ్ముకుంటున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఏపీలో మద్యం ధరలను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసిందని వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ మార్జిన్లో ప్రభుత్వం మార్పులు చేసిందని, ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం తగ్గించిందని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఐఎంఎల్ లిక్కర్‌పై వ్యాట్ 35 నుంచి 50 శాతం, స్పెషల్ మార్జిన్ 10 నుంచి 20 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 5 నుంచి 26 శాతం, అన్ని కేటగిరిల మద్యంపై 20 శాతం వరకు ధరలు తగ్గాయని, జనం కోసమే జగన్ ఇలా చేశారని డబ్బా కొట్టుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా, ఏపీలో నాటుసారా తయారీకి చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయమని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, త్వరలో ఏపీలో మరిన్ని నాణ్యమైన బ్రాండ్లు దొరుకుతాయని భరోసా ఇస్తున్నారు. జనం కోసమే ఇదంతా అని ప్రచారం చేస్తున్నారు. కానీ, ఈ హడావిడి నిర్ణయం వెనుక అసలు కారణం వేరే ఉంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ ఫిర్యాదుతో కేంద్రం నుంచి వచ్చిన టీమ్…జగన్ అమ్మే నకిలీ బ్రాండ్లను గుర్తించింది. బ్రాండ్ మార్చకపోతే బ్యాండ్ పడుతుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో, జగన్ మద్యంపై ‘నకిలీ’లలు ఆపాల్సి వచ్చింది.