ఏపీలో ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు పార్టీల నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో, మూడు పార్టీలలో చాలామంది నేతలకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. ఈ క్రమంలోనే టికెట్ దక్కని నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. తొలి విడత నామినేటెడ్ పోస్టులలో మూడు పార్టీలకు చెందిన కొందరికి అవకాశం దక్కింది. అయితే, ఇంకా చాలామందికి పోస్టులు దక్కలేదు. ఈ క్రమంలోనే తాజాగా రెండో విడత నామినేటెడ్ పోస్టుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.
59 మందితో రెండో జాబితా తాజాగా విడుదలైంది. టీడీపీలో టికెట్ దక్కని కీలక నేతలకు రెండో జాబిాలో నామినేటెడ్ పదవులు దక్కాయి.. ఈ జాబితాలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు చోటు దక్కింది. సీనియారిటీ, పార్టీ కోసం కష్ట పడిన వైనం, పలు అంశాలను పరిగణలోకి తీసుకొని అవకాశం కల్పించారు.
1. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( మైనార్టీ ) కేబినెట్ ర్యాంక్ – మహమ్మద్ షరీఫ్ ( నర్సాపురం-టీడీపీ )
2. అడ్వైజర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ( స్టూడెంట్స్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ) కేబినెట్ ర్యాంక్ – చాగంటి కోటేశ్వర్ రావు
3. ఏపీ శెట్టి బలిజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – కూడిపూడి సత్తిబాబు ( రాజమండ్రి – టీడీపీ)
4. ఏపీ గవర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – మాల సురేంద్ర ( అనకాపల్లి – టీడీపీ )
5. ఏపీ కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – రోనంకి కృష్ణం నాయుడు ( నరసన్నపేట – టీడీపీ )
6. ఏపీ కొప్పుల వెలమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్- పీవీజీ కుమార్ ( మాడుగుల – టీడీపీ)
7. ఏపీ కురుబ – కురుమ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – దేవేంద్రప్ప ( ఆదోని – టీడీపీ)
8. ఏపీ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – ఆర్ సదాశివ ( తిరుపతి – టీడీపీ )
9. ఏపీ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – సావిత్రి ( అడ్వొకేట్ – బీజేపీ )
10. ఏపీ తూర్పు కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – పాలవలస యశస్వి ( శ్రీకాకుళం – జనసేన )
11. ఏపీ వాల్మీకి – బోయ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – కపట్రాల సుశీలమ్మ ( బోజమ్మ ) ( ఆలూరు – టీడీపీ )
12. ఏపీ వన్యకుల క్షత్రియ ( వనేరెడ్డి, వన్నికాపు, పల్లి కాపు, పల్లి రెడ్డి) కోపరేటివ్ ఫైనాన్స్ కొర్పొరేషన్ లిమిటెడ్ – సి ఆర్ రాజన్ ( చంద్రగిరి -టీడీపీ)
13. ఏపీ యాదవ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – నరసింహ యాదవ్ ( తిరుపతి – టీడీపీ )
14. ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – చిలకలపూడి పాపారావు ( రేపల్లె – జనసేన)
15. ఏపీ గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – వీరంకి వెంకట గురుమూర్తి ( పామర్రు – టీడీపీ )
16. ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ – గండి బాబ్జి ( పెందుర్తి – టీడీపీ)
17. ఏపీ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ విజయవాడ – మంజులా రెడ్డి రెంటచింతల – ( మాచర్ల – టీడీపీ)
18. ఏపీ స్టేట్ బయో – డైవర్సిటీ బోర్డు – నీలాయపాలెం విజయకుమార్ (తిరుపతి – టీడీపీ )
19. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ – జీవి రెడ్డి ( మార్కాపురం – టీడీపీ )
20 ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ – మన్నవ మోహన్ కృష్ణ ( గుంటూరు వెస్ట్ టీడీపీ )
21. ఏపీ కల్చరల్ కమిషన్ – తేజ్జస్వి పొడపాటి ( ఒంగోలు – టీడీపీ)
22. ఏపీ ఎన్విరాన్మెంట్ మ్యానేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – పొలంరెడ్డి దినేష్ రెడ్డి ( కోవూరు – టీడీపీ)
23. ఏపీ ఫారెస్ట్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – సుజయ్ కృష్ణ రంగారావు ( బొబ్బిలి – టీడీపీ)
24. ఏపీ గ్రంధాలయ పరిషద్ – గోనుగుంట్ల కోటేశ్వర రావు ( నరసరావుపేట – టీడీపీ)
25. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ – డేగల ప్రభాకర్ ( గుంటూరు ఈస్ట్ – టీడీపీ )
26. ఏపీ ఖాదీ అండ్ ఇండస్ట్రీస్ బోర్డు ( కేకే చౌదరి – కోడూరు – టీడీపీ )
27. ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ – చిల్లపల్లి శ్రీనివాస రావు ( జనసేన )
28. ఏపీ రోడ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – ప్రగడ నాగేశ్వర రావు ( యలమంచిలి – టీడీపీ)
29. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ – మరెడ్డి శ్రీనివాస రెడ్డి ( ఒంగోలు – టీడీపీ)
30. ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అధారిటీ – ఆనం వెంకట రమణా రెడ్డి ( నెల్లూరు రూరల్ – టీడీపీ)
31. ఏపీ స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ – రఘురామ రాజు గొట్టిముక్కల ( విజయవాడ సెంట్రల్ – టీడీపీ)
32. ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అధారిటీ – సావల దేవదత్ (తిరువూరు – టీడీపీ )
33. ఏపీ స్టేట్ వేర్ హోసింగ్ కార్పొరేషన్ – రావి వెంకటేశ్వర రావు ( గుడివాడ – టీడీపీ)
34. ఏపీ ఉమెన్స్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ – కావాలి గ్రీష్మ ( రాజాం – టీడీపీ)
35. ఏపీఎస్ఆర్టిసి రీజనల్ బోర్డు ఛైర్మెన్ ( దోన్ను దొర – టీడీపీ ( విజయనగరం జోన్ ) , రెడ్డి అప్పల నాయుడు – జనసేన( విజయవాడ జోన్ ), సురేష్ రెడ్డి – బీజేపీ( నెల్లూరు జోన్ ) , పోలా నాగరాజు – టీడీపీ ( కడప జోన్ )
36. ఏపీ హ్యాండ్ లూమ్ కోపరేటివ్ సొసైటీ – సజ్జా హేమలతా ( చీరాల – టీడీపీ )
37 . ఏపీ నాటక అకాడమీ – గుమ్మడి గోపాల కృష్ణ ( పామర్రు – టీడీపీ )
38. ఎన్టీఆర్ వైద్య సేవ – సీతారామ సుధాకర్ ( విశాఖపట్నం సౌత్ – టీడీపీ )
39. స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ – కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ( విజయవాడ వెస్ట్ – టీడీపీ )
40 . అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – స్వామినాయుడు ఆలాడ ( అమలాపురం – టీడీపీ )
41. అనంతపూర్ – హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – టిసి . వరుణ్ – అనంతపూర్ – జనసేన )
42. అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – రూపానంద రెడ్డి ( కోడూరు – టీడీపీ )
43. బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సలగల రాజశేఖర్ బాబు ( బాపట్ల – టీడీపీ )
44. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తెంటు లక్ష్మి నాయుడు ( బొబ్బిలి – టీడీపీ)
45. చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కే. హేమలత ( చిత్తూరు – టీడీపీ )
46. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – తుమ్మల రామస్వామి ( కాకినాడ – జనసేన)
47. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – సోమిశెట్టి వెంకటేశ్వర్లు ( కర్నూలు – టీడీపీ)
48. మచిలీపట్టణం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – మట్టా ప్రసాద్ ( మచిలీపట్నం – బీజేపీ)
49. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ( నెల్లూరు రూరల్ – టీడీపీ)
50. రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – బోడ్డు వెంకటరమణ చౌదరి ( రాజానగరం – టిడిపి )
51. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ – కోరికన రవికుమార్ ( శ్రీకాకుళం – జనసేన )
52. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవెలప్మెంట్ అధారిటీ – ప్రణవ్ గోపాల్ ( విశాఖపట్నం ఈస్ట్ )
53. ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ – ముస్తాక్ అహ్మద్ ( నంద్యాల టీడీపీ )
54. ఏపీ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – డి. రాకేష్ ( విజయవాడ వెస్ట్ – టీడీపీ)
55 . ఏపీ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – వి. సూర్యనారాయణ రాజు ( కనకరాజు సూరి ) ( భీమవరం – జనసేన )
56. ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ – కొత్తపల్లి సుబ్బారాయుడు ( నరసాపురం – జనసేన)
57. ఏపీ మాదిగ వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – ఉండవల్లి శ్రీదేవి ( తాడికొండ – టీడీపీ )
58. ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ – డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ ( ఒంగోలు – జనసేన )
59. ఏపీ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ – కిడారి శ్రావణ్ ( అరకు వ్యాలీ – టీడీపీ)