కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు తాత్కాలికంగా మూసివేయమని అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.
అంతకుముందు సీఎం కేసీఆర్తో మంత్రి సబితాఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. అనంతరం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. సరిగ్గా కీలక పరీక్షల సమయంలో పాఠశాలలు, కాలేజీలు క్లోజ్ చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా భయం కంటే పరీక్షలే వారిని ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్నాయి.
#Telangana Govt has decided to shut down all schools, educational institutions from Match 24th (except medical colleges)in the wake of rising #COVIDー19 cases among students. State EducationMinister says a lot of parents have requested closing of schools. #Hyderabad #coronavirus pic.twitter.com/dw9U6K7532
— Rishika Sadam (@RishikaSadam) March 23, 2021